వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం విడిచి వెళ్లను: భార్య చేయూత అక్కర్లేదని సోనియా అల్లుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రా... మన దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని వివాహమాడిన తర్వాత ఒక్కసారిగా అయన ప్రముఖుల జాబితాలో చేరిపోయారు.

అయితే పదేళ్ల కాంగ్రెస్ పార్టీలో ఆయన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతంలో అక్రమంగా ప్రజల భూములను సొంత చేసుకున్నారని ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. దీంతో ఈ భూముల వ్యవహారంపై హర్యానా ప్రభుత్వం ఇంకా విచారణ జరుపుతూనే ఉంది.

అయితే రాబర్ట్ వాద్రా భూదాహాన్ని నిర్ధారణ చేయకున్నా... అక్రమాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు మాత్రం వచ్చాయి. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను కేసులు సైతం చుట్టుముట్టాయి. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ గాలి వీయడంతో ఆయన ప్రధాని అయ్యారు.

Robert Vadra: I would never leave India, didn't need Priyanka to enhance my life

దీంతో ప్రముఖుల హోదాలో రాబర్ట్ వాద్రాకు అందుతున్న సౌకర్యాలన్నీ ఒక్కటొక్కటిగా తొలగించేశారు. ఈ క్రమంలో కేసులకు తట్టుకోలేక రాబర్ట్ వాద్రా విదేశాలకు పారిపోతారనే పుకార్లు జాతీయ మీడియాలో వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ఆ నోటా ఈ నోటా పడి చివరకు రాబర్ట్ వాద్రాను చేరాయి.

తాను దేశం విడిచి వెళ్లుతున్నట్లు వస్తున్న వ్యాఖ్యలపై వాద్రా కాస్తంత ఘాటుగానే స్పందించారు. తాను భారత్ విడిచివెళ్లే ప్రసక్తే లేదని ఆయన నేటి ఉదయం 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు చెప్పారు. అంతేకాక తాను చిక్కుల్లో నుంచి బయటపడేందుకు తన భార్య ప్రియాంక చేయూత కూడా తనకు అవసరం లేదని పేర్కొన్నారు.

తన తండ్రి తనకు కావాల్సిన అన్నింటినీ ఇచ్చారని, అన్ని రకాల పరిస్థితుల్లో భేషుగ్గా రాణించే సత్తా నేర్పారని కూడా రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించడం విశేషం.

English summary
Robert Vadra, the son-in-law of Congress president Sonia Gandhi, has said that he did not need Priyanka to enhance his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X