వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెండా ఏదైతేనేం పోస్ట్ చేశామా...లేదా అన్నదే పాయింట్...సరికొత్త వివాదంలో రాబర్ట్ వాద్రా

|
Google Oneindia TeluguNews

అసలే వివాదాల్లో ఉన్న ప్రియాంక గాంధి భర్త రాబర్ట్ వాద్ర మరో వివాదంలో క్కుకున్నారు. ఓటు వినియోగించుకున్నానే ఉత్సహాంతో ఆ ఫోటోను నెటిజన్లకు పంచబోయిన రాబార్ట్ వాద్ర ఎరక్కపోయి ఇరుక్కున్నారు. మన జాతీయ జెండాకు బదులు పరాగ్వే దేశ జాతీయ జెండాను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అసలే జాతీయత భావంతో అటు కాంగ్రెస్ , బీజేపీల మధ్య తీవ్ర పోరు నడుస్తున్న సమయంలో రాబర్ట్ వాద్ర పోస్టింగ్స్ విమర్శకుల నోళ్లకు పని కల్పించింది.

Robert vadra posted paraguay national flag in twitter

విషయంలోకి వెళితే ఆరవదశ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం రాబర్ట్ వాద్ర ప్రియాంక గాంధితో కలిసి ఢిల్లిలో తన ఓటును వినియోగించుకున్నాడు. అనంతరం ఓటువేసిన సింబల్ గుర్తుతో తన ఫోటోను పోస్ట్ చేస్తూ.... మన హక్కే మన బలం అంటూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి .మనం ఇష్ట పడివారి కోసం లౌకికవాదం నిలబడడం కోసం ,దేశ భవిష్యత్ కోసం అందరి మద్దతు కావాలని ట్విట్టర్ లో పేర్కోన్నారు.

ఇక్కడ వరకు బాగానే వ్యాఖ్యలు రాసిన ఆయన చివరలో మాత్రం ఖంగు తిన్నాడు. చివరి వాఖ్యం తర్వాత దండం పెడుతూ పక్కనే ..పరాగ్వే దేశం యొక్క జాతీయ జెండాను పోస్ట్ చేశాడు. విషయం ఏమిటంటే పరాగ్వే దేశం యొక్క జాతీయ జెండా కూడ భారత జాతీయ జెండాను వలే మూడు రంగులు ఉంటుంది. కాని అందులో మధ్య‌‌‌లో వైట్ కలర్ ఉండగా ,పైన రెడ్ కలర్ క్రింద నీలం కలర్ తో ఉంటుంది. దీంతో ఈ తేడాను గమనించని రాబర్ట్ వాద్ర దాన్ని నేరుగా పోస్ట్ చేయడంతో నెటిజన్లకు దొరికిపోయాడు.

దీంతో ఆయనపై విమర్శల అస్ల్ర్రాలు దూసుకు వచ్చాయి. కనీసం జాతీయ కూడ తెలియకుండా రాబర్ట్ వాద్ర ఉన్నడంటూ రిటన్ ట్వీట్స్ వెళ్లాయి. అయితే పోరపాటును గ్రహించిన వాద్ర తిరిగి భారత దేశం యొక్క జాతీయ జెండాను తిరిగి పోస్ట్ చేశాడు. అయితేనేం అప్పటికే జరిగే నష్టం జరిగి పోయింది. పలువురు నెటిజన్లు స్క్ర్రీన్ షాట్ తీసీ షేర్ కూడ చేశారు. అయితే దీనిపై రాజకీయ విమర్శలు మాత్రం ఇంకా అయన్ను తాకలేదు..విషయం ప్రత్యర్థి పార్టీలకు చేరితే ఎలా ఉంటుందో వేచి చూడాలి.

English summary
Robert vadra who is husband of priyanka gandhi,posted on Twitter Paraguay national flag Rather than indian national flag, it is going to be viral in social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X