వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. రాబర్ట్ భావోద్వేగం

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం తీవ్రంగా స్పందించారు. లక్నో సిటీలో చోటుచేసుకున్న ఘటన తనను కలిచివేసిందని, ఇద్దరు మహిళా పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోవడం, ఇంకొకరు కిందికి నెట్టేయడం వీడియోలో స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు.

Robert Vadra stands with wife Priyanka Gandhi after UP Police manhandles her

నిన్నుచూసి గర్వపడుతున్నా..
లక్నోలో పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకునిమరీ ప్రియాంక గాంధీ.. మాజీ ఐపీఎస్ దారాపురి ఇంటికెళ్లి, బాధితుల్ని పరామర్శించారు. బాధితుల్ని కలిసి భరోసా ఇవ్వడం నేరం కానేకాదని రాబర్ట్ వాద్రా అన్నారు. ''ప్రియాంక.. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీ అవసరం ఉందికాబట్టే వెళ్లి బాధితుల్ని కలుసుకున్నావ్. నువ్వు చేసిన పని ముమ్మాటికీ సరైందే''అంటూ వాద్రా ట్వీట్ చేశారు.

Robert Vadra stands with wife Priyanka Gandhi after UP Police manhandles her

పోలీసులు చేయిచేసుకున్నారన్న ప్రియాంక
సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో రిటైర్డు ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ దారాపురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. లక్నోలోని ఆయన ఇంటికి వెళ్లి పామర్శించేందుకు శనివారం ప్రియాంక గాంధీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో జరిగిన తోపులాటలో పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ప్రియాంక ఆరోపించారు. శనివారం సాయంత్రం సమయానికి నాటకీయ ఫక్కీలో ప్రియాంక దారాపురిని కలవగలిగారు.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra's husband Robert Vadra on Sunday condemned the treatment meted out to her by the Uttar Pradesh Police in Lucknow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X