వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: 2030 నాటికి 800 మిలియన్ ఉద్యోగాలకు ఎసరు, కారణమిదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ వల్ల 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 800 మిలియన్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని మెకిన్సే అనే సంస్థ తాజాగా వెల్లడించింది. ఇండియాలో సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ తాజాగా తేల్చి చెప్పింది.

టెక్కీలకు శుభవార్త: ఇండియాలో 'ఆపిల్‌' యూనిట్: సురేష్ ప్రభుటెక్కీలకు శుభవార్త: ఇండియాలో 'ఆపిల్‌' యూనిట్: సురేష్ ప్రభు

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతోంది. అయితే టెక్నాలజీ ఉపయోగం వల్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపుతోంది. రోబోలు, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే సంఖ్య వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలుటెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు

ఆటోమేషన్ కారణంగా పని సులభతరం కానుంది. అయితే అదే సమయంలో మనుషుల అవసరం కూడ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆటోమేషన్, రోబోల కారణంగా రానున్న రోజుల్లో దాని ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 రోబోలు,ఆటోమేషన్‌తో 800 మిలియన్ ఉద్యోగాలకు ముప్పు

రోబోలు,ఆటోమేషన్‌తో 800 మిలియన్ ఉద్యోగాలకు ముప్పు

రోబోలు, ఆటోమేషన్‌తో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో తేల్చిచెప్పింది.ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం.ఈ పరిణామాలను గమనిస్తే నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.

 అభివృద్ది చెందిన దేశాలపై ప్రభావం

అభివృద్ది చెందిన దేశాలపై ప్రభావం

ఆటోమేషన్, రోబోలతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని మెకిన్సే సంస్థ హెచ్చరించింది.

ఆటోమేషన్‌ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్‌ ఆపరేటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ వర్కర్లు, బ్యాక్‌-ఆఫీస్‌ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని ఆ సంస్థ హెచ్చరించింది.

 ఆటోమేషన్ విస్తరించకపోతే 40 కోట్ల మందిపై ప్రభావం

ఆటోమేషన్ విస్తరించకపోతే 40 కోట్ల మందిపై ప్రభావం

ఒకవేళ రోబోలు, ఆటోమేషన్‌ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. ఆటోమేషన్, రోబోలు విస్తరిస్తే ఏ రకమైన ప్రభావం ఉంటుందనే విషయమై 46 దేశాల్లో మెకిన్సే సంస్థ సర్వే నిర్వహించింది.

భారత్‌లో 12 కోట్ల మందికి ఉపాధి కరువు

భారత్‌లో 12 కోట్ల మందికి ఉపాధి కరువు

ఆటోమేషన్, రోబోల ప్రభావం‌తో ఇండియాపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 2030 నాటికి సుమారు 12 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని మెకిన్సే సంస్థ తేల్చి చెప్పింది. అయితే ఆటోమేషన్, రోబోల కారణంగా ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయేది చైనాలో ఉండే అవకాశం ఉందని మెకిన్సే సంస్థ అభిప్రాయపడింది. చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది.

English summary
Up to 800 million global workers will lose their jobs by 2030 and be replaced by robotic automation, a new report from a consultancy has found.The study of 46 countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X