• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Rohini Sindhuri biopic: తెలుగు ఐఎఎస్ అధికారిణిపై మూవీ: బిగ్‌బాస్ కంటెస్టెంట్ లీడ్ రోల్‌

|

బెంగళూరు: విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, తరచూ ట్రాన్స్‌ఫర్లను ఎదుర్కొంటోన్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి కథ.. వెండితెరపైకి ఎక్కనుంది. సమర్థురాలైన ఐఎఎస్ అధికారిగా ఆమె వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించడానికి శాండల్‌వుడ్ సిద్ధమైంది. దీనికోసం టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారు నిర్మాత. లీడ్ రోల్ సహా ఇతర పాత్రలకు చెందిన నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. రోహిణి సింధూరి పాత్రలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ నటించే అవకాశాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలకు తుఫాన్ ముప్పు: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంఏపీ, తెలంగాణలకు తుఫాన్ ముప్పు: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

భారత సింధూరిగా

భారత సింధూరిగా

రోహిణి సింధూరి బయోపిక్‌ మూవీకి భారత సింధూరి అనే టైటిల్ ఖరారు చేశారు. బెంగళూరులోని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో ఈ టైటిల్ రిజిస్టర్ అయింది. రోహిణి సింధూరి రోల్‌లో నటించడానికి అక్షతా పాండవపురను సంప్రదిస్తోంది చిత్రం యూనిట్. అక్షత పాండవపుర.. కన్నడ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్. కన్నడ బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా ఉన్నారామె. బేసిక్‌గా ఆమె థియేటర్ ఆర్టిస్ట్. కన్నడలో ఒకట్రెండు సినిమాల్లో నటించారు. పింకీ ఎల్లి, ఆ ఒందు నోటు సినిమాల్లో లీడ్‌రోల్ పోషించారు.

తొలి పోస్టింగ్..

తొలి పోస్టింగ్..

ఏపీకి చెందిన అధికారిణి రోహిణి సింధూరి. 2009లో సివిల్స్ ర్యాంకర్. జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్‌ను సాధించారామె. కర్ణాటక కేడర్‌కు ఎంపికయ్యారు. 2011లో తొలి పోస్టింగ్. ఆ ఏడాది తుమకూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌ (అసిస్టెంట్ కలెక్టర్)గా నియమితులయ్యారు. క్రమంగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమించింది.

ఐఎఎస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ..

ఐఎఎస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ..

తుమకూరు అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ- దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యేంత వరకు చోటు చేసుకున్న పరిణామాలను భారత సింధూరి మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ స్వర్ణసంద్ర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆయనే ఈ సినిమాకు నిర్మాత కూడా. నాతిచరామి సినిమాకు కథను సమకూర్చిన సంధ్యారాణి.. రోహిణి సింధూరి బయోపిక్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తోన్నారు. ప్రస్తుతం తుది మెరుగులను దిద్దుకుంటోందీ స్క్రిప్ట్. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తామని కృష్ణ స్వర్ణసంద్ర తెలిపారు.

  Kannada Ugliest Language కన్నడ గొప్పతనాన్ని తెలిపేలా నెటిజన్ల పోస్టులు Google Apologizes |Oneindia
  వివాదాలకు అవకాశం ఇవ్వకుండా..

  వివాదాలకు అవకాశం ఇవ్వకుండా..

  రోహిణి సింధూరి విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు?, ఆమె తరచూ బదిలీలను ఎదుర్కొనడానికి కారణాలేంటీ? అనే అంశాలను మాత్రమే తెరకెక్కిస్తామని కృష్ణ స్వర్ణసంద్ర పేర్కొన్నారు. ముక్కుసూటిగా పనిచేసే ఓ ఐఎఎస్ అధికారిణి.. తన విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని కథాంశంగా తీసుకున్నామని చెప్పారు. ఐఎఎస్ అధికారులెవరైనా తరచూ బదిలీలకు గురవుతోన్నారంటే.. దాని వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని, వాటిని పరిమితంగా చూపించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

  English summary
  The speculations concerning Rohini Sindhuri's biopic have been rife for quite some time. Titled 'Bharatha Sindhuri'. Reports have also stated that former Bigg Boss Kannada contestant Akshatha Pandavapura has been approached to play the role.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X