వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన బొగ్గు గని పైకప్పు, 4గురు మృతి: పడవ బోల్తా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roof of coal mine collapses in Dhanbad
రాంచీ/పాట్నా: జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం రాష్ట్రంలోని ధనబాద్‌లోని బిసిసిఎల్ బొగ్గు గని పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. దాదాపు మరో యాభై మంది గనిలోనే చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పు కూలిన నేపథ్యంలో శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

బీహార్‌లో పడవ బోల్తా

బీహార్‌లో పడవ బోల్తా పడింది. సీతాముఢి జిల్లా బైర్గానియాలో పడవ బోల్తా పడి యాభై మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమంయలో పడవలో వంద మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నారాయణపూర్ జిల్లా టులెంగాలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య అరగంట సేపు కాల్పులు జరిగాయి.

ఈవిఎం ఎత్తుకెళ్లిన మావోలు

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పంఖజోర్‌లో మావోయిస్టులు ఈవిఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోలు ప్రయత్నించారు.

English summary
Roof of coal mine collapses in Dhanbad, over 50 miners trapped, 4 killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X