వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cycle జైత్రయాత్ర: పదో తరగతిలో 98.5% మార్కులు, స్టేట్ 8వ ర్యాంకు, రోజు 24 కి.మీ. సలామ్ చెల్లెమ్మ!

|
Google Oneindia TeluguNews

భోపాల్: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకు అనేక రాష్ట్రాల్లో 10వ తరగతి, ఇంటర్ తో పాటు అనేక ముఖ్యమైన పరీక్షలు రద్దు కావడంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చంకలు గుద్దుకుంటూ ఎగిరిగంతెశారు. అయితే ప్రతిరోజు 24 కిలోమీటర్లు సైకిల్ లో ప్రయాణించి 10వ తరగతి పరీక్షలు రాసిన అమ్మాయి 98.5 శాతం మార్కులు సంపాధించి రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సంపాధించింది. అమ్మాయి పట్టుదల, ఆమె సాధించిన మార్కులు చూసిన దేశ ప్రజలు సలామ్ చెల్లెమ్మా అంటున్నారు.

<strong>Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!</strong>Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!

మారుమూల గ్రామం

మారుమూల గ్రామం

మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని మారుమూల ఉన్న అజ్నోల్ గ్రామంలో రోష్ని భడౌరియా (15) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది. రోష్ని భడోరియా నివాసం ఉంటున్న గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (హై స్కూల్) ఉంది. ఇంత కాలం రోష్ని స్కూల్ కు వెళ్లిరావడానికి ప్రతిరోజు రోష్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు పంపిణి చేసిన సైకిల్ మీద 24 కిలోమీటర్లు ప్రయాణం చేసేది.

ఉత్సాహంగా పదో తరగతి పరీక్షలు

ఉత్సాహంగా పదో తరగతి పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో అందరు విద్యార్థులులాగానే చాలా రోజులు రోష్ని కూడా ఇంట్లోలోనే ఉంటున్నది. అయితే ఇన్ని రోజులు కష్టపడి పరీక్షలు రాయడానికి సిద్దం అయిన రోష్నితో పాటు 10వ తరగతి విద్యార్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, అన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాపించకుండా 10వ తరగతి పరీక్షలు నిర్వహించడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సక్సస్ అయ్యింది.

సత్తాచాటిన రోష్ని

సత్తాచాటిన రోష్ని

రోష్ని నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న కొందరు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు జరిగే ప్రాంతంలోని వారివారి బంధువుల ఇళ్లల్లో నివాసం ఉంటూ పరీక్షలు రాశారు. అయితే రోష్నికి ఆ ఊరిలో ఎవ్వరూ బంధువులు లేకపోవడంతో ప్రతిరోజు 24 కిలోమీటర్లలో పరీక్షా కేంద్రానికి వెళ్లి వస్తూ 10వ తరగతి పరీక్షలు రాసింది. 10వ తరగతి పరీక్షల్లో రోష్నికి 98.5 శాతం మార్క్ లు సంపాధించి ఆమె సత్తాచాటుకుంది.

స్టేట్ 8వ ర్యాంక్, సూపర్ చెల్లెమ్మ

స్టేట్ 8వ ర్యాంక్, సూపర్ చెల్లెమ్మ

కరోనా వైరస్ వ్యాధిని లెక్క చెయ్యకుండా, ఒంటరిగా అంతదూరం వెళ్లి పరీక్షలు రాయాలి అనే ఏమాత్రం భయం లేకుండా 10వ తరగతి పరీక్షలు రాసి 98.5 శాతం మార్కులు సంపాధించి స్టేట్ 8వ ర్యాంకు సంపాధించిన రోష్ని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. పరీక్షలు జరిగిన ప్రతిరోజు 24 కిలోమీటర్ల దూరం సైకిల్ మీద ప్రయాణించి పరీక్షలు రాసిన అమ్మాయి రోష్ని స్టేట్ 8వ ర్యాంకు సంపాధించిందని తెలుసుకున్న దేశ ప్రజలు నువ్వు గ్రేట్ చెల్లెమ్మ అంటున్నారు.

English summary
Coronavirus: 15-year-old Roshni Bhadauria, who used to cycle for 24 kilometres on a daily basis just to attend school, has secured eighth rank by scoring 98.5 per cent in the Class 10 board exams conducted by Madhya Pradesh state board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X