రొటొమ్యాక్ ఇక క్లోజ్?: వేలం వేయనున్న దివాలా కోర్టు..

Subscribe to Oneindia Telugu

ముంబై: రుణాల చెల్లింపు కోసం రొటొమ్యాక్ సంస్థ కోరిన 90రోజుల అదనపు గడువును బ్యాంకులు తిరస్కరించాయి. దీంతో రొటొమ్యాక్‌ సంస్థలు మూత పడబోతున్నాయి.

అంతకుముందు ఇచ్చిన గడువు మార్చి 19తో ముగుస్తుండటంతో రొటొమ్యాక్ ఆస్తులను వేలం వేయనున్నారు. ఈ మేరకు దివాలా కోర్టు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

వెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్త

 రొటొమ్యాక్ సంస్థల వేలం..

రొటొమ్యాక్ సంస్థల వేలం..

విక్రమ్‌ కొఠారికి చెందిన రొటొమ్యాక్‌ ఎక్స్‌పోర్ట్స్‌, రొటొమ్యాక్‌ గ్లోబల్‌ సంస్థలను దివాలా కోర్టు వేలం వేయబోతున్నట్టు చెబుతున్నారు. రుణాల వసూలుకు రెజల్యూషన్ ప్లాన్ కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రొటొమ్యాక్‌ సంస్థల రెజుల్యూషన్‌ ప్రొఫిషనల్‌ అనిల్‌ గోయల్‌ దీన్ని ధృవీకరించారు.

 కొద్దిరోజుల క్రితమే అరెస్ట్:

కొద్దిరోజుల క్రితమే అరెస్ట్:

గడువు పొడగింపును బ్యాంకులు తిరస్కరించినట్టు అనిల్ గోయల్ తెలిపారు. తుది గడువు పొడగింపుపై ఓటింగ్ కోసం శుక్రవారం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ దీనిపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కాగా, విచారణకు సహకరించకపోవడంతో కొద్ది రోజుల క్రితమే రొటొమ్యాక్‌ యజమాని విక్రమ్‌ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్‌ కొఠారిలను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

నిన్న నీరవ్‌.. నేడు రొటొమాక్‌ యజమాని?.. ఆపై ఫొర్టిస్ ఈడీ

రూ.4వేల కోట్ల రుణాలు

రూ.4వేల కోట్ల రుణాలు

రొటొమ్యాక్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారీ.. సంస్థ పేరు మీద తీసుకున్న రుణాలను స్వప్రయోజనాల కొరకు వాడినట్టు సీబీఐ నిర్దారించింది.

బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌, అలహాబాద్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రల నుంచి రొటొమ్యాక్‌ గ్రూప్‌ కంపెనీలు దాదాపు రూ.4000 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేశాయి.

ఏయే బ్యాంకులో ఎంత

ఏయే బ్యాంకులో ఎంత

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్‌ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ. 97.47 కోట్ల వరకు రొటొమ్యాక్‌ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian banks Friday set a tough precedent in filtering out fraud-accused owners from participating in turnaround plans, rejecting for the first time a 90-day extension to a debt-recast programme at two Rotomac group companies that together owe local lenders about Rs 4,000 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి