వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో మళ్లీ చర్చలు షురూ -చుషూల్ సెక్టార్‌లో భేటీ అయిన రెండు దేశాల సైనిక అధికారులు -డ్రాగన్ తగ్గేనా?

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు తొలగిపోయేలా సైనిక, దౌత్య మార్గాల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. తాజాగా మరోసారి భారత్.. చైనాతో చర్చల ప్రక్రియను పున:ప్రారంభించింది. ఇటీవల సరిహద్దు నుంచి 10వేల మంది సైనికులను వెనక్కి పంపేసిన చైనా.. ఇంకాస్త వెనక్కి తగ్గేలా మనవాళ్లు ఒత్తిడి పెంచుతున్నారు..

Recommended Video

Round 9 of India-China Military Talks Underway to Resolve Ladakh Stand-off | Oneindia Telugu

తూర్పు లదాక్ లోని చుషూల్ సెక్టార్ లో భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య ఆదివారం 9వ రౌండ్ చర్చలు ప్రారంభం అయ్యాయి. చుషూల్ సెక్టార్‌లోని మోల్డో ప్రాంతంలో చర్చలకు వేదికగా ఉంది. దౌత్యమార్గంలో నెరపిన చర్చలకు ఫలితంగా సైనిక చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించంగా, ఆదివారం నాడే సైనిక అధికారులు భేటీ కావడం గమనార్హం.

Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడాShrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

Round 9 of India-China Military Talks Begin to Resolve Ladakh Stand-off

సరిహద్దులో 2020 ఏప్రిల్ నాటి పరిస్థితులు (స్టేటస్ కో) ఉండాలని భారత్ పదేపదే కోరుతున్నా, చైనా మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ కొత్త ప్రాంతాల్లో ఆక్రమణలకు ప్రయత్నించింది. ఈక్రమంలోనే గడిచిన 10 నెలల్లో ఇరువైపుల సైన్యాలు పలు మార్లు బాహాబాహికి దిగడం, గతేడాది జూన్ లో గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు, ఆ తర్వాత కాల్పులు కూడా చోటుచేసుకోవడం తెలిసిందే. కాగా,

RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనాRBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

స్టాండాఫ్ కొనసాగుతోన్న దరిమిలా చైనాకు దీటుగా భారత్ సైతం అదే సంఖ్యలో సైన్యాలను, ఆయుధసంపత్తిని సరిహద్దులో మోహరించింది. అయితే, గత నెలలో చైనా సైన్యాల నుంచి 10వేల మందిని వెనక్కి పంపేసింది. మరింత మందిని వెనక్కి తీసుకునేలా చైనాపై భారత్ ఒత్తిడి చేయనుంది. ప్రస్తుతానికి తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, ఆ సరస్సుకు దక్షిణ ఒడ్డున ఉన్న పర్వత శ్రేణులపై భారత్ పట్టు కొనసాగిస్తోంది.

English summary
The ninth round of India-China corps commander level talks over the Ladakh stand-off have begun at Moldo on the Chinese side with an aim to once again resolve the ongoing conflict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X