చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రౌడీషీటర్ తో అక్రమ సంబంధం, భర్త ముందే జల్సాలు, బాహుబలి స్టైల్లో చంపించింది !

|
Google Oneindia TeluguNews

చెన్నై: రౌడీషీటర్ దారుణ హత్య కేసులో అతని ప్రియురాలితో పాటు నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని పాడికలై వానర్ నగర్ లో నివాసం ఉండే సురేష్ (31) అనే యువకుడిని హత్య చేసిన అతని ప్రియురాలు కార్తిక, ఆమె భర్త జయకొడి, వీరి స్నేహితులు సుందరకాండన్, రాజా అనే నిందితులను అరెస్టు చేశారు. రౌడీషీటర్ సురేష్ ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. తరువాత తల, మొండం వేరు చేశారు. తలను తీసుకెళ్లి రెడ్ హిల్స్ సమీపంలోని నాకరు వద్ద పొదల్లో మొండం పడేసి సమీపంలోని కాలవలో తల విసిరివేశారని పోలీసులు విచారణలో వెలుగు చూసింది.

భార్య మీద అనుమానం, పెళ్లి రోజే గోతిలో పూడ్చి పెట్టి భర్త డ్రామాలు, బెండ్ తీస్తే!భార్య మీద అనుమానం, పెళ్లి రోజే గోతిలో పూడ్చి పెట్టి భర్త డ్రామాలు, బెండ్ తీస్తే!

మేనమామ హత్య

మేనమామ హత్య

చెన్నైలోని పాడి కలైవానర్ నగర్ కు చెందిన సురేష్ రౌడీషీటర్. సురేష్ అదే ప్రాంతంలోని పొన్నియమ్మన్ దేవాలయం వీధిలోని స్టాండ్ లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. సొంత మేనమామను 2005లో హత్య చేసిన సురేష్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతని మీద ప్రస్తుతం అనేక కేసులు విచారణలో ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన సురేష్ తల్లి కళతో కలిసి పుళల్ కావాంగరై ప్రాంతానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు.

పాత సహవాసం పొరకతో కొట్టినా పోదు

పాత సహవాసం పొరకతో కొట్టినా పోదు

పుళల్ కావాంగరై ప్రాంతానికి ఇల్లు మార్చిన పురేష్ అప్పుడప్పుడు కలైవానర్ నగర్ లోని ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. ఆటో స్టాండ్ సమీపంలో కార్తీక అనే మహిళ టిఫిన్ సెంటర్ నడుపుతోంది. కార్తీకాకు జయకొడి అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే సురేష్, కార్తీకా స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. జయకొడికి ఈ విషయం తెలిసినా కార్తీకాతో సురేష్ జల్సా చెయ్యడం మొదలు పెట్టాడు.

భర్త ముందే ప్రియుడితో జల్సా

భర్త ముందే ప్రియుడితో జల్సా

భర్త జయకొడికి అన్ని విషయాలు తెలిసినా కార్తీకా మాత్రం రౌడీషీటర్ సురేష్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. ఈ విషయంలో తెలిసితెలియనట్లు జయకొడి ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాడు. అయితే నిత్యం మద్యం మత్తులో కార్తీకా ఇంటికి వెలుతున్న రౌడీషీటర్ సురేష్ ఆమెతో గొడవ పెట్టుకుని నానా హంగామా చేసేవాడు.

రౌడీషీటర్ మాయం

రౌడీషీటర్ మాయం

గత నెల 14వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సురేష్ తరువాత హఠాత్తుగా కనపడకుండా పోయాడు. సురేష్ సవారీకి వెళ్లి ఉంటాడని, లేదా పాత కేసుల్లో పోలీసులకు పట్టుబడి ఉంటాడని అతని తల్లి కళ, స్నేహితులు భావించారు. చాలా రోజులు కావడంతో సురేష్ తల్లి కళకు అనుమానం వచ్చింది. తన కొడుకు కనపడటం లేదని కళ అంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

సురేష్ గురించి పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కళ డీఎస్పీ ఈశ్వరన్ కు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఈశ్వరన్ ఆదేశాలతో కొరట్టూరు పోలీసులు రంగంలోకి దిగారు. మాయం అయిన రౌడీషీటర్ సురేష్ కు టిఫిన్ సెంటర్ యజమాని కార్తీకా అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే కార్తీకా, ఆమె భర్త జయకొడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ప్రియురాలు ఫోన్

ప్రియురాలు ఫోన్

మద్యం మత్తులో సురేష్ గత నెల 14వ తేదీన కార్తీకా ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది కావడంతో కార్తీకా, ఆమె భర్త జయకొడి కలిసి సురేష్ మీద దాడి చేశారు. తరువాత కార్తీకా ఆమె స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కార్తీకా ఇంటికి వెళ్లిన స్నేహితులు రాజా, సుందరకాండన్ రౌడీ షీటర్ సురేష్ ను చంపేయాలని నిర్ణయించారు.

బాహుబలి స్టైల్ లో హత్య

బాహుబలి స్టైల్ లో హత్య

నలుగురు దాడి చెయ్యడంతో రౌడీషీటర్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. తరువాత కార్తీకా, జయకొడి, రాజా, సుందరకాండన్ కలిసి సురేష్ ను కారులో కిడ్నాప్ చేశారు. రెడ్ హిల్స్ సమీపంలోని పొదల దగ్గరకు సురేష్ ను తీసుకెళ్లి బాహుబలి స్టైల్ లో అతని తల, మొండెం వేరు చేశారు. మొండెం పొదల్లో విసిరి వేసి తల తీసుకెళ్లి సమీపంలోని పెద్ద కాలువలో విసిరివేసి ఏమీ తెలియనట్లు ఉండిపోయారు. అయితే పోలీసులు కార్తీకా, ఆమె భర్త జయకొడిని బెండ్ తియ్యడంతో సురేష్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని దారుణంగా హత్య చేయించిన కార్తీకాతో పాటు ఆమె భర్త జయకొడి, రాజా, సుందరకాండన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

English summary
Tamil Nadu: Rowdy murder in chennai due to illegal relationship and police have arrested couple regarding this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X