వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఆర్ నగర్ ఎమ్మెల్యే నాయుడు పదవిని స్పీకర్ రద్దు చెయ్యాలి, సుప్రీం కోర్టుకు, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) ఎమ్మెల్యే మునిరత్న నాయుడు పదవిని రద్దు చెయ్యాలని స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేస్తామని ఆ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయిన తులసి మునిరాజు గౌడ మంగళవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు. ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని మునిరాజు గౌడ ఆరోపించారు. మునిరత్న నాయుడు పదవి రద్దు చేయించడానికి అవసరం అయితే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని మునిరాజు గౌడ అన్నారు.

ఓటరు ఐడీ స్కాం

ఓటరు ఐడీ స్కాం

నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం లాగే ఆర్ఆర్ నగర్ లో నకిలీ ఓటరు ఐడీ కార్డుల కుంభకోణం వెలుగు చూసిందని మునిరాజు గౌడ అరోపించారు. వేల సంఖ్యలో ఓటరు ఐడీ కార్డులు అపార్ట్ మెంట్ లో పెట్టి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చెయ్యడానికి ప్రయత్నించారని మునిరాజు గౌడ ఆరోపించారు.

ఎమ్మెల్యే కింగ్ పిన్

ఎమ్మెల్యే కింగ్ పిన్

నకిలీ ఓటరు ఐడీ కార్డులు తయరు చెయ్యడానికి ఆర్ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయకుడు ప్రధాన కారణం అని బీజేపీ నాయకుడు మునిరాజు గౌడ ఆరోపించారు. ఇంత తతంగానికి కారణం అయిన మునిరత్న నాయుడు శాసన సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేస్తామని మునిరాజు గౌడ అన్నారు.

420 కేసు నమోదు

420 కేసు నమోదు

9,000కు పైగా ఓటరు గుర్తింపు కార్డులు ఒకే చోట స్వాధీనం చేసుకున్న జాలహళ్ళి పోలీసులు 420 కేసు నమోదు చేశారని మునిరాజు గౌడ గుర్తు చేశారు. అయితే ఈ కేసు విచారణ పూర్తి చెయ్యకుండానే ఎన్నికలు నిర్వహించారని, ఇంత వరకు ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని మునిరాజు గౌడ ఆరోపించారు.

సుప్రీం కోర్టులో అర్జీ

సుప్రీం కోర్టులో అర్జీ

ఆర్ఆర్ నగర్ ప్రజలు తనతోపాటు జేడీఎస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓట్లు వేశారని, మునిరత్న నాయుడు అనుచరులు అమాయకులను బెదిరించి ఓట్లు వేయించుకుని అరాచకాలకు పాల్పడ్డారని మునిరాజు గౌడ ఆరోపించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన మునిరత్న నాయుడు శాసన సభ్యత్వాన్ని రద్దు చేయించడానికి తాను సుప్రీం కోర్టుకు వెలుతానని మునిరాజు గౌడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడిని హెచ్చరించారు.

English summary
Defeated BJP candidate in RR Nagar assembly constituency Tulasi Muniraju Gowda has said he will appeal before the speaker seeking disqualification of MLA Munirathna who was involved in fake voters ID scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X