వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ఉద్యోగాల భర్తీలో అవకతవకలు: అభ్యర్థుల భారీ ఆందోళన, రైలుకు నిప్పు, రాళ్లదాడి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఉద్యోగార్థుల ఆందోళన హింసాత్మక ఘటనలకు దారితీసింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీహార్‌లో పలు చోట్ల ఉద్యోగార్థులు భారీ ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలు మంగళ, బుధవారాల్లో హింసాత్మకంగా మారాయి. వేలాది మంది నిరసనకారులు గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌లకు వెళ్లి రైలు పట్టాలపై రైలు రోకో చేశారు.

అంతేగాక, గయాలో నిరసనలు హింసాత్మకం దాడులు దిగారు. దాదాపు 200 మంది ఉద్యోగ అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్‌కు చేరుకొని ఆగివున్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

RRB NTPC Huge protest: Students Set Train Coach At Gaya Station On Fire.

'2019లో పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చినా.. సీబీటీ-2 టెస్టు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. తక్షణమే సీబీటీ-2 పరీక్షను రద్దు చేయాలి' అంటూ నిరసనకారులు వార్త సంస్థ ఏఎన్ఐ ప్రతినిధితో తెలిపారు. నిరసనల నేపథ్యంలో ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డుల(ఆర్​ఆర్​బీ) పరిధిలో జరిగిన పరీక్షల్లో పాస్​, ఫెయిల్​ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధిధికారులు వెల్లడించారు.

అభ్యర్థుల హింసాత్మక ఘటనలపై గయా ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అభ్యర్థులు అశాంతియుతంగా నిరసన చేపట్టడంపై ఆదిత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలుకు నిప్పు పెట్టిన పలువురు నిరసనకారుల ముఖచిత్రాలను ప్రత్యేక సాంకేతికత సహాయంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ తెలిపారు.

Recommended Video

Hydrogen Economy Explained ఒకటో నంబరు ఇంధనం Green Hydrogen | Climate Change

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని ఉద్యోగార్ధులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని.. బోర్డు, అభ్యర్థుల వాదనలు విన్న తర్వాత కమిటీ.. రైల్వే శాఖకు నివేదిక సమర్పిస్తుందని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. కాగా, నిరసనల నేపథ్యంలో బీహార్లోని పలు ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. గయా మీదుగా వచ్చే అన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా దాడుల ఘటనపై స్పందించింది. సొంత ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని పేర్కొంది.

English summary
RRB NTPC Huge protest: Students Set Train Coach At Gaya Station On Fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X