• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్టీఆర్, రామ్‌చరణ్ రచ్చరచ్చ: ఆ స్టెప్ వేయలేక చేతులెత్తేసిన సల్మాన్: నావల్ల కాదంటూ ఏడుపుముఖం

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ హవా నడుస్తోంది. విడుదలకు ముందే ఆ మేనియా కమ్మేసింది. ట్రైలర్ జనాన్ని పలకరించినప్పటి నుంచీ అన్ని వుడ్లల్లోనూ ఈ పాన్ ఇండియా మూవీ గురించే టాక్. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్, చివరికి బాలీవుడ్‌ను కూడా షేక్ చేస్తోందీ ట్రైలర్. ఆకాశాన్నంటే అంచనాలు ఈ సినిమాపై నెలకొని ఉన్నాయి. భారతీయ చలన చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిలో నిలిచిపోతుందంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తోన్నారు.

పాన్ ఇండియా క్రేజ్..

పాన్ ఇండియా క్రేజ్..

జూనియర్ ఎన్టీఆర్-రామచరణ్-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్, బాహుబలి- ది కన్‌క్లూజన్ తరువాత వస్తోన్న మూవీ కావడం, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించడం వల్ల పాన్ ఇండియా క్రేజ్‌ను సంపాదించుకుందీ మూవీ. సినిమా విడుదల తేదీ దగ్గరికొస్తోన్న కొద్దీ దీని ప్రమోషన్ ఊపందుకుంటోంది. ఇందులో భాగంగానే- కొద్ది రోజుల కిందటే రామ్‌చరణ్, ఆలియా భట్, రాజమౌళి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్‌లో మెరుపులు మెరిపించారు.

బిగ్‌బాస్ డయాస్‌పై..

బిగ్‌బాస్ డయాస్‌పై..

ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ టీమ్- హిందీ బిగ్‌బాస్‌లో తళుక్కుమంది. కొద్దిరోజుల కిందటే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇప్పుడదే ప్రమోషన్‌లో భాగంగా హిందీలో టెలికాస్ట్ అవుతోన్న బిగ్‌బాస్ సీజన్ 15లో రచ్చ రచ్చ చేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, ఆలియాభట్, బిగ్‌బాస్ సీజన్ 15లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. బిగ్గెస్ట్ రియాలిటీ టెలివిజన్ షోను హోస్ట్ చేస్తోన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి స్టెప్పులేశారు.

నాచో నాచో పాటకు స్టెప్స్..

నాచో నాచో పాటకు స్టెప్స్..

నాటు నాటు పాటతో రచ్చ చేశారు. ఈ నాటు నాటు కాస్తా హిందీలో నాచో నాచోగా మారింది. రామ్‌చరణ్-ఎన్టీఆర్ ఈ పాటకు స్టెప్పులేశారనడం కంటే.. సల్మాన్‌ఖాన్‌కు ఆ స్టెప్పుల గురించి నేర్పించారనడం కరెక్ట్. బీట్‌కు అనుగుణంగా సల్మాన్ ఖాన్ స్టెప్స్ వేయలేక ఏడుపు మొఖం పెట్టేశాడు. వన్-టూ-త్రీ-ఫోర్ అంటూ స్టెప్‌ను సల్మాన్ ఖాన్‌కు నేర్పించారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మీ ఇద్దరిలా నేను డాన్స్ చేసి తీరుతానంటూ సల్మాన్ ఖాన్ ప్రామిస్ చేశాడు. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చాడు. స్టెప్స్ వేస్తోన్న సమయంలో సల్మాన్ ఖాన్ షర్ట్ బటన్ ఊడిపోగా.. దాన్ని ఆలియా భట్ వేయడం హైలైట్.

మీకు నా ముద్దులు..

తెలుగు సినిమాలో నటించినందున ఆ భాషలో ఓ డైలాగ్ చెప్పాలంటూ సల్మాన్ ఖాన్- ఆలియా భట్‌ను కోరగా.. మీకు నా ముద్దులు అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందామె. ఈ మూవీని ఎలా షూట్ చేశారో వివరించాలంటూ సల్మాన్ ఖాన్ కోరడంతో ఎస్ఎస్ రాజమౌళి అక్కడికక్కడే ఓ సీన్ డైరెక్ట్ చేశారు. మై ఆప్ కో జిందా నహీ ఛోడ్తా.. అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం, రామ్‌చరణ్ అతని భుజం మీది నుంచి షూట్ చేస్తోన్నట్టు ఫోజు ఇవ్వడం, ఎస్ఎస్ రాజమౌళి కట్ కట్ అంటూ చెప్పడం అక్కడికక్కడే చకచకా సాగిపోయాయి.

అజయ్ దేవ్‌గణ్‌ను తీసుకోవడానికి కారణం..

అజయ్ దేవ్‌గణ్‌ను తీసుకోవడానికి కారణం..

ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్‌ కోసం ఆయననే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని రాజమౌళి తేల్చేశారు. ఈ సినిమాను నార్త్-సౌత్ స్టార్స్ కాంబినేషన్‌లో తీయాలనో.. దేవ్‌గణ్‌తో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో ఉంచుకునో.. అతన్ని తీసుకోలేదని అన్నారు. ఆ క్యారెక్టర్‌కు అజయ్ ఒక్కరే సరిపోతారని ముందు నుంచీ భావించానని అన్నారు.

15 నిమిషాల్లో ఫైనల్..

ట్రిపుల్ ఆర్‌లో అజయ్ దేవ్‌గణ్ పోషించిన క్యారెక్టర్ అత్యంత కీలకమైనదని రాజమౌళి చెప్పారు. దీని గురించి నెరేట్ చేయడానికి 15 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వాలని తాను అజయ్ దేవ్‌గణ్‌ను కోరానని గుర్తు చేసుకున్నారు. నెరేషన్ పూర్తి కాకముందే- ఈ పాత్రలో నటించడానికి ఆయన అంగీకరించారని అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అత్యవసరమే అయినప్పటికీ- దానికి తగ్గట్టుగా నటీనటుల ఎంపిక లేకపోతే అర్థం ఉండదని చెప్పారు.

సల్లూభాయ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే..

సల్లూభాయ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే..

సోమవారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. 57వ బర్త్‌డేను ఆయన జరుపుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్ 15 వీకెండ్ ఎపిసోడ్ కావడం, బిగ్ స్టార్స్ ఒకేచోటికి చేరుకోవడంతో ఆయన అడ్వాన్స్డ్‌గా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. డయాస్ మీదే కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఆలియా భట్ సమక్షంలో కేక్ కట్ చేశారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో కలిసి డాన్స్ చేశారు.

English summary
The team of the film Jr NTR, Ram Charan, Alia Bhatt and SS Rajamouli will be seen on Bigg Boss 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X