వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మేనకోడలు దీప మీద రూ. 1.12 చీటింగ్ కేసు: మోసం చేశారు, అమ్మ పేరు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్, ఆమె భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజా తనను మోసం చేశారని, రూ. 1.12 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యాపారవేత్త చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

కొత్త పార్టీ

కొత్త పార్టీ

జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు దీప ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పార్టీని స్థాపించారు. ఆ సందర్బంలో చెన్నైలోని ఇంజంబాక్కంలో నివాసం ఉంటున్న ఎరువుల వ్యాపారి రామచంద్రన్ దీప ను కలిశారని తెలిసింది.

జిల్లా ప్రధాన కార్యదర్శి

జిల్లా ప్రధాన కార్యదర్శి

ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పార్టీలో తనకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.12 కోట్లు తీసుకున్నారని, తరువాత తనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని, తీసుకున్న నగదు తిరిగి ఇవ్వలేదని సోమవారం రామచంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

 అమ్మ పేరు ప్రతిష్టలు

అమ్మ పేరు ప్రతిష్టలు

తాను జయలలిత మేనకోడలు అంటూ అమ్మ పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకుని దీప ప్రజలను మోసం చేస్తున్నారని, తనను అలాగే మోస చేశారని, తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇప్పించాలని వ్యాపారి రామచంద్రన్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

 విచారణ ముమ్మరం

విచారణ ముమ్మరం

రామచంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై సిటీ పోలీసులు జయలలిత మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజా రూ. 1.12 కోట్లు తీసుకుని మోసం చేశారా ? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసు విషయంలో ఎంజీఆర్ అమ్మా దీప పేరవైలోని కొందరు నాయకులను విచారణ చేస్తున్నారు.

కేసు పెట్టిన దీప

కేసు పెట్టిన దీప

ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత జయంతి వేడుకలు నిర్వహించడానికి తాను ఏర్పాట్లు చేస్తుంటే శశికళ, టీటీవీ దినకరన్ వర్గీయులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవలే దీప చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

English summary
A businessman on Monday lodged a complaint with the Greater Chennai city police commissionerate, alleging that MGR Amma Deepa Peravai head Deepa Jayakumar had cheated him to the tune of Rs 1.12 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X