వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 1.5 కోట్ల టీ సెట్, అయితే ఏంటి: యశోధర రాజే

|
Google Oneindia TeluguNews

Yashodhara Raje
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యశోధర రాజే సింధియా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన తన ఆస్తుల వివరాల అఫిడవిట్‌లో 1.5 కోట్ల రూపాయల విలువ చేసే టీ సెట్ తన ఇంట్లో ఉందని తెలిపింది. అయితే ఈ టీ సెట్ ఆమెకు పలు చిక్కులను తెచ్చిపెడుతోంది. దీనిపై ప్రతిపక్షాలు ఆమెపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్న యశోధర రాజే బుధవారం ఎన్‌డిటివి‌తో మాట్లాడారు. ఇది పెద్ద విషయమేమి కాదని, తమది రాజవంశమని, ఆ కాలం నుంచి వచ్చిన సంపదే అది అని ఆమె అన్నారు. తాము పిల్లల జన్మదినోత్సవం లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారు ప్లేట్లల్లో, వెండి గిన్నెలలో భోజనం చేసేవాళ్లమని ఆమె తెలిపారు.

అది తమ కుటుంబ సాంప్రదాయమని, వివాహ సందర్భంలోనూ ఆరు బంగారు గిన్నెలు ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పారు. అయితే ఇదేమంతా విశేషం కాదని, తమది రాజుల కుటుంబమని తెలుసు కాదా? అని యశోధర రాజే మీడియాను ప్రశ్నించారు. గ్వాలియర్ రాజుల కుటుంబానికి చెందిన యశోధర రాజే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివపురి నుంచి పోటీ చేస్తున్నారు.

తమ కుటుంబ సంపదపై ఇంత రద్దాంతం ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని యశోధర రాజే అన్నారు. అయితే తన ఆస్తికి అదనంగా ఉన్నటువంటి ఆ టీ కప్పు సెట్ గురించి అడిగినప్పుడు ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతోందని, వివాదాలు మీడియాకు ప్రియమైనవని ఆమె అన్నారు. తాము ధనవంతులము కాబట్టి అవినీతికి పాల్పడే అవకాశం ఉండదని ఆమె పేర్కొన్నారు. తన సోదరి వసుంధర రాజే (బిజెపి రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి) గానీ, మేనల్లుడు జ్యోతిరాధిత్య సింధియాలు(గ్వాలియర్ కాంగ్రెస్ నేత) అవినీతికి పాల్పడే అవకాశమే లేదని ఆమె అన్నారు.

English summary
Yashodhara Raje, a BJP candidate in poll-bound Madhya Pradesh, raised eyebrows when she declared a tea set worth Rs 1.5 crore in her affidavit to the Election Commission earlier this month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X