వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే బంపర్ ఆఫర్.. పన్ను రాయితీ ఎంతో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మొక్కలను పెంచడం ప్రారంభించారు కూడా. కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డిజీల్ వాహనాలు కాక .. ఎలక్ట్రిక్ వాహనాలను నడుపాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్‌లో రాయితీ కూడా ఇచ్చారు.

ఆఫర్ ..
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి వివిధ ప్రయోజనాలను కల్పిస్తోంది. పార్కింగ్ ఫ్రీ అని, ఇన్సూరెన్స్ లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రాయితీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన వారికి రూ.లక్షన్నర పన్ను రాయితీ అందిస్తామని బంఫర్ ఆఫర్ పర్కటించారు. వారు వాహనం కొనుగోలు సమయంలోనే ఈ పన్ను రాయితీ అందజేస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే తక్కువ జీఎస్టీ విధించిన సంగతి తెలసిందే. ఈ ప్రయోజనంతో వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

 Rs 1.5 lakh income tax deduction on loans taken to buy e-vehicles

భారమే .. కానీ
దీంతో వినియోగదారులకు దాదాపు 2.5 లక్షల కోట్ల ప్రయోజనం కలుగుతుందని లెక్కగట్టారు. ఈ రాయితీ కేంద్రానికి భారమైనా .. ప్రజా ప్రయోజనాల కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే రూ.2.5 లక్షల విలువ, ఆపై ధర గల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తేనే ఈ పన్ను రాయితీ వర్తిస్తుందని కండీషన్ విధించారు. ఓ దేశ పౌరుడిగా పన్ను కడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నిర్మలా. దేశాభివృద్ధి కోసం వారు కడుతున్న పన్ను వల్లే .. వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని వివరించారు. దీంతోపాటు గృహ రుణాలకు కూడా రూ. లక్షన్నర రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. 2013-14లో పన్ను రాబడి రూ.6.37 కోట్లు ఉంటే .. 2018-19కి అది రూ.11.37 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

English summary
in yet another bid to promote electric vehicle in the Union Budget 2019, Finance Minister Nirmala Sitharaman announced that there will be an income tax deduction of Rs 1.5 lakh on loans taken to buy e-vehicles. Nirmala Sitharaman, who made her maiden Budget speech in the Parliament on Friday, announced a tax deduction of Rs 1.5 lakh on loans taken to buy e-vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X