• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోడీ సంచలనం: 86 శాతం మనీ వేస్ట్, రూ. 14 లక్షల కోట్లు

By Pratap
|

న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, 1000 నోట్లు చెల్లవని ప్రకటించిన నేపథ్యంలో మంగలవారం అర్థరాత్రి నుంచి దాదాపు రూ.14 లక్షల కోట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం లెక్కకు రాని డబ్బులు అంతగా చెలామణిలో ఉన్నాయి. అదంతా ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా పోతుంది.

అందులో రూ.500 నోట్ల దాదాపు 7.85 లక్షల కోట్లు కాగా, వేయి రూపాయల నోట్లు రూ.6.33 వరకు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇదంతా నల్ల డబ్బే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూడు విధాలుగా నల్లధనంపై ప్రభావం చూపుతుంది.

Rs 14 Lakh Cr Cash Junked–What That Means For Black Money

1. అకస్మాత్తుగా ప్రకటన చేయడం వల్లే భారతీయుల వద్ద ఉన్న బ్లాక్ మనీపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే దాన్ని బయటకు తేవడానికి రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి - తమ గుర్తింపును చెబుతూ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని లేదా ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ లోగా డబ్బును మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రాథమికంగా సర్క్యేలేషన్ ప్రకారం - రోజుకు రూ.4 వేల రూపాయల నుంచి ఓ వ్యక్తి గడువులోగా కేవలం 60 వేల రూపాయల మాత్రమే మార్పిడి చేసుకోగలడు. ఈ గడువు ముగిసిన తర్వాత సౌకర్యం కోసం మార్పిడి ప్రక్రియలో వెసులుబాట్లు కల్పించవచ్చు. అయితే, డిపాజిట్లపై పరిమితి లేదు.

2. రహస్యంగా, లెక్క చెప్పకుండా దాచిపెట్టిన డబ్బును గడువులోగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమ్ ముగిసింది. దానివల్ల దాచిపెట్టిన డబ్బును చూపించడం అంత సులభం కాదు. దానివల్ల దాచిపెట్టిన లేదా లెక్క చూపని డబ్బంతా చిత్తు కాగితాలుగా మారిపోతుంది.

3. నోటుకు ఓటు అనే వ్యవహారం భారత ఎన్నికల్లో పరిపాటిగా మారింది. ఇటువంటి సందర్భాల్లో ఓట్లో కోసం డబ్బులు ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి భారీ డబ్బును మోసుకుపోవడం కష్టమవుతుంది.

2011 నుంచి 2016 మధఅయ కాలంలో బ్యాంకు నోట్స్ 40 శాతం పెరిగాయి. రూ. 500 నోట్లను 76 శాతం, వేయి రూపాయల నోట్లను 109 శాతం పెంచారు. నవంబర్ 10వ తేదీ నుంచి కొత్త రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి వస్తాయి. వాటిని రిజర్వ్ బ్యాంక్ మోనిటర్ చేస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rs 14 lakh crore–or $217 billion, 86% of the value of Indian currency currently in circulation–will become useless from midnight of November 8, 2016, part of the government’s crackdown on black, or unaccounted, money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more