వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాణాషాపు యజమాని ఇంట్లోని రూ. 17కోట్లు, భారీగా గోల్డ్ సీజ్

తమిళనాడులోని వేలూరులో ఓ కిరాణ దుకాణం యజమాని నుంచి రూ.17 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఓ కిరాణ దుకాణం యజమాని నుంచి రూ.17 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.

Rs 17 crores and heavy amount of gold found in a small shop owner.

వివరాల్లోకి వెళితే.. వేలూరులోని సత్తువాచారి గంగయమ్మ ఆలయం వద్ద కేశవ మొదలియార్‌ కిరాణ దుకాణం నడుపుతున్నారు. ఈయనకు సత్తువాచారిలో సుమారు 70కి పైగా ఇళ్లు ఉన్నాయి. పెద్దనోట్లు రద్దు నేపథ్యంలో నవంబర్ 24వ తేదీన కేశవ రూ.కోటితో భారీ ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేశారు.

విషయం తెలుసుకున్న ఆదాయపుపన్ను విభాగం అధికారులు అదే రోజు కేశవ ఇళ్లు, దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. ఇంట్లోని భూగర్భ గదిలో ఉన్న రూ.17 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్‌లు స్వాధీనం చేసుకొని కేశవను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

English summary
Rs 17 crores and heavy amount of gold found in a small shop owner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X