వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాప్‌రే : మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించిన విమాన ఖర్చులు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ విమాన ఖర్చులు తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే. విదేశాలకు మోడీ వెళ్లిన సమయంలో ఆయన విమాన ఖర్చులను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. 2014లో జూన్‌లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి తను చేసిన చివరి విదేశీ పర్యటనకు సంబంధించి ఫ్లైట్ చార్జెస్ అంటే చార్టర్డ్ ఫ్లైట్లు, మెయింటెనెన్స్, హాట్‌లైన్ సదుపాయం వీటన్నిటికీ అయిన ఖర్చు అక్షరాల రూ. 2,021 కోట్లు అని మంత్రి వీకే సింగ్ సభకు తెలిపారు.

మోడీ విదేశీ పర్యటనలతో దేశంలో పెరిగి ఎఫ్‌డీఐలు

మోడీ విదేశీ పర్యటనలతో దేశంలో పెరిగి ఎఫ్‌డీఐలు

సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మోడీ పర్యటించిన దేశాల పేర్లు కూడా సభకు చెప్పారు. భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా వచ్చిన దేశాల్లోనే ప్రధాని పర్యటించడం విశేషం. 2014లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30,930.5 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017 సంవత్సరం నాటికి ఎఫ్‌డీఐలు 43478.27 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయని మంత్రి వివరించారు.

మోడీ మన్మోహన్ వర్సెస్ మోడీ విమాన ఖర్చులు

మోడీ మన్మోహన్ వర్సెస్ మోడీ విమాన ఖర్చులు

ఇక మోడీ కంటే ముందు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన విమాన ఖర్చులను కూడా సభకు తెలిపారు మంత్రి వీకే సింగ్. మన్మోహన్ ప్రయాణించిన చార్టర్డ్ ఫ్లైట్, మెయింటెనెన్స్, హాట్‌లైన్ సదుపాయాలకు అయిన ఖర్చు రూ.1,346 కోట్లు. అయితే ఇది 2009-10, 2013-14 సంవత్సరానికి చెందిన వివరాలని వీకే సింగ్ వెల్లడించారు. మన్మోహన్ సింగ్ అధికార పర్యటనల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ వివరణ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ విమానం మెయింటెనెన్స్ కోసం రూ. 1583.18 కోట్లు ఖర్చు కాగా ఛార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు రూ. 429.25 కోట్లు ఖర్చు అయినట్లు సభకు తెలిపారు. ఇది జూన్ 15,2014 నుంచి డిసెంబరు 3, 2018 వరకు ఉన్న సమాచారం అని సభకు తెలిపారు వీకేసింగ్.ఇక హాట్‌లైన్ సదుపాయాల కోసం అయిన ఖర్చు రూ. 9.11 కోట్లు అని వివరించారు.

మోడీ విమాన ఖర్చులు ఇవే...!

మోడీ విమాన ఖర్చులు ఇవే...!

ఇక ప్రధాని నరేంద్ర మోడీ 48 విదేశీ పర్యటనలు చేయగా అందులో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు. కొన్ని సార్లు ఒకే దేశానికి పలుమార్లు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అయితే వీకే సింగ్ చెప్పిన లెక్కల్లో 2017-18,2018-19కి సంబంధించి హాట్‌లైన్ సదుపాయాల ఖర్చు ప్రస్తావన లేకపోవడం విశేషం. ఇక ఓవర్సీస్ గమ్యస్థానాలకు అయిన చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు అంటే 2014-15 రూ. 93.76 కోట్లు కాగా, 2015-16లో 117.89 కోట్లుగా తేలిందన్నారు. 2016-17లో రూ.76.27 కోట్లు ఉండగా 2017-18కి ఖర్చుల వివరాలు 99.32 కోట్లుగా ఉందన్నారు. ఇక 2018-19 డిసెంబర్ 3 వరకు ప్రధాని మోడీ చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు రూ. 42.01 కోట్లు అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వీకే సింగ్.

English summary
More than Rs 2,021 crore was spent on chartered flights, maintenance of aircraft and hotline facilities during Prime Minister Narendra Modi's visits to foreign countries since June 2014, according to the government. Replying to queries on the issue in Rajya Sabha, Minister of State for External Affairs V K Singh also listed the countries visited by the Prime Minister between 2014 and 2018 that now figure among the top 10 countries from where India has received the maximum Foreign Direct Investment or FDI inflows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X