వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తొలి బుల్లెట్‌ రైలు రికార్డు- అహ్మదాబాద్‌-ముంబై మధ్య- రూ.24 వేల కోట్లతో

|
Google Oneindia TeluguNews

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అయిన అహ్మదాబాద్‌-ముంబై మార్గం నిర్మాణానికి కీలక అడుగుపడింది. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద కాంట్రాక్టుగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఇంత భారీ స్ధాయిలో ఏ సివిల్‌ కాంట్రాక్టు జరగలేదు.
గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు జరగాల్సి ఉంది.

Recommended Video

#BulletTrain : Ahmedabad-Mumbai రైలు మార్గ నిర్మాణానికి కీలక అడుగు.. అతిపెద్ద కాంట్రాక్టుగా Record

దేశంలోనే తొలి, అత్యంత భారీ బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్‌ కార్పోరేషన్‌-ఎల్‌ అండ్‌ టీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సివిల్‌ కాంట్రాక్టుగా ఇది రికార్డు సృష్టించింది.. మొత్తం రూ.24 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ కాంట్రాక్టును ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్ధ ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది.

Rs 24,000 crore ahmedabadd-mumbai bullet train contract creates record

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకూ బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ప్రత్యేక మార్గం నిర్మించాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం గుజరాత్‌ పరిధిలోని 325 కిలోమీటర్ల మార్గంలోనే ఎల్‌ అండ్‌ టీ పనులు చేపట్టనుంది. మహారాష్ట్రలో భూసేకరణలో సమస్యలు ఉన్నందున దాంతో సంబంధం లేకుండా గుజరాత్‌లో పనులు ప్రారంభించాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారు. జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

మరోవైపు భారత్‌లో ఆర్ధిక కార్యకలాపాలు విస్తరించేందుకు జపాన్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంతటి భారీ కాంట్రాక్టు దక్కడం సంతోషంగా ఉందని జపాన్‌ రాయబారి సతోషీ సుజుకీ తెలిపారు. జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు దక్కడమే కాకుండా ఈ కారిడార్‌ వెంబడి పట్టణాబివృద్ధికీ బాటలు పడతాయని ఆయన వెల్లడించారు. ఇది విజయవంతంగా పూర్తయితే మరో ఏడు మార్గాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ప్లాన్‌ చేస్తున్నట్లు రైల్వేబోర్డు సీఈవో వీకే యాదవ్‌ తెలిపారు. ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుల వల్ల భారీగా నిపుణులకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన తెలిపారు.

English summary
the national high speed rail corporation on thursday signed country's largest ever government funded civil contract of rs.24,000 crore for the ahmedabad-mumbai bullet train project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X