వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ బ్లాక్ : గత మూడేళ్లలో ప్రధాని మోడీ విమాన ఖర్చులు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

MEA Reveals How Much Money Was Spent On PM Modi's Foreign Engagements In Last 3 Years

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక చాలా విదేశీ పర్యటనలు చేశారు. అయితే తన విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గత మూడేళ్ల విదేశీ పర్యటనలకు సంబంధించిన విమాన ఖర్చుల వివరాలను వెల్లడించింది. గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన విమాన ఖర్చులు రూ. 255 కోట్లు అని రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది.

 చారిత్రక ఘట్టాలకు సాక్షి, సెకండ్ హౌస్, నాట్ సెకండరీ, మేధావులకు ప్రాతినిధ్యం: రాజ్యసభలో మోడీ చారిత్రక ఘట్టాలకు సాక్షి, సెకండ్ హౌస్, నాట్ సెకండరీ, మేధావులకు ప్రాతినిధ్యం: రాజ్యసభలో మోడీ

 మోడీ విమాన ఖర్చులు రూ. 255 కోట్లు

మోడీ విమాన ఖర్చులు రూ. 255 కోట్లు

ప్రధాని మోడీ విదేశీ పర్యటన సందర్భంగా అయిన విమాన ఖర్చులు తెలపాలంటూ లిఖితపూర్వక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 2016-17లో రూ. 76.27 కోట్లు చార్టర్డ్ విమానాలపై ఖర్చు చేసినట్లు చెప్పారు. 2017-18లో రూ. 99.32 కోట్లు ఖర్చు చేసినట్లు సభకు వెల్లడించారు. ఇక 2018-19లో రూ. 79.91 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనల సందర్భంగా ఖర్చు చేయగా.. 2019-20కి సంబంధించిన వివరాలు ఇంకా అందలేదని మురళీధరన్ సభకు తెలిపారు.

హాట్‌లైన్ ఖర్చులు

హాట్‌లైన్ ఖర్చులు

ఇక హాట్‌లైన్ ఫెసిలిటీకి సంబంధించిన వివరాలను కూడా సభకు వెల్లడించారు మురళీధరన్. 2016-17లో విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో హాట్‌లైన్ వినియోగంకు రూ. 2,24 ,75, 451 ఖర్చు చేసినట్లు చెప్పారు. అదే 2017-18 సంవత్సరంకుగాను రూ.58,06,630 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇక దేశీయ పర్యటనల సందర్భంగా మోడీ విమానాయాన ఖర్చులు గురించి ప్రశ్న తలెత్తగా దానిపై స్పందించారు మురళీధరన్.

 వీవీఐపీలకు దేశంలో ఉచిత ప్రయాణాలు

వీవీఐపీలకు దేశంలో ఉచిత ప్రయాణాలు

భారత ప్రభుత్వం విధానాల ప్రకారం వీవీఐపీలు, వీఐపీలకు భారత వైమానిక దళంకు చెందిన విమానాల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుందని వాటికి ఎలాంటి ఖర్చులు ఉండవని చెప్పారు. ప్రధాని వీవీఐపీ కేటగిరీ కిందకు వస్తారు కనుక దేశంలో చేసిన పర్యటనల్లో మోడీ ప్రయాణించిన విమానం లేదా హెలికాఫ్టర్లకు ఎలాంటి చార్జీలు చెల్లించమని స్పష్టం చేశారు. అవి పూర్తిగా ఉచితమే అని సభకు మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు.

 2014 నుంచి 2019 వరకు అయిన ఖర్చు

2014 నుంచి 2019 వరకు అయిన ఖర్చు

ఇక 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ మొత్తం 92 దేశాలను చుట్టేశారు. ఇందులో ఒకే దేశంలో రెండుసార్లు అంతకన్న ఎక్కువగా పర్యటించారు. మొత్తానికి 2014 నుంచి 2019వరకు అంటే ఆ 4 ఏళ్ల ఏడు నెలల్లో మోడీ చేసిన విదేశీ పర్యటనల సందర్భంగా అయిన విమానాల ఖర్చు ఏకంగా రూ. 2,021 కోట్లు. అంటే విమానాల మెయింటెనెన్స్, వినియోగించిన చార్టర్డ్ ఫ్లయిట్, హాట్‌లైన్‌కు ఈ స్థాయిలో ఖర్చు అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఒక్కో దేశ పర్యటనకు మోడీకి అయిన ఖర్చు రూ.22 కోట్లుగా ఉన్నింది.

English summary
An expenditure of over Rs 255 crore was incurred on chartered flights during Prime Minister Narendra Modi's foreign engagements in the past three years, the Rajya Sabha was told on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X