వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది ‘కిల్ ఇండియా ప్రొగ్రాం’: మరోసారి విరుచుకుపడ్డ రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం రాఫెల్‌ విషయంపై ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. ప్రధాని మోడీ స్కిల్‌ ఇండియా క్యాంపెయిన్‌ను ఎస్‌-కిల్‌ ఇండియా అంటూ ఘాటుగా విమర్శించారు.

విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం లేనటువంటి కంపెనీకి రూ.30వేల కోట్ల కాంట్రాక్టును అప్పగించారని రాహుల్ దుయ్యబట్టారు. దీని వల్ల ఎంతో నైపుణ్యం కలిగిన యువత ఇప్పుడు నిరుద్యోగులుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

 Rs 30,000 Cr stolen from HAL, PM on a KILL India program, says Rahul

'ప్రధాని ఎస్‌-కిల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా హాల్‌(హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌)కు రావాల్సిన రూ.30వేల కోట్లు లాక్కొని విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యాలు లేనటువంటి వ్యక్తికి ఇచ్చారు. దీని వల్ల గత 20ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎంతో నైపుణ్యం కలిగిన యువత ఇప్పుడు తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది' అంటూ రాహుల్‌ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఆరోపణలు?: రాఫెల్ డీల్‌‌పై తేల్చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం, డసో ఏవియేషన్కాంగ్రెస్ ఆరోపణలు?: రాఫెల్ డీల్‌‌పై తేల్చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం, డసో ఏవియేషన్

దేశంలో నిరుద్యోగిత భారీగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, రాఫెల్‌ డీల్‌తోపాటు విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనుకున్న మరిన్ని వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయని మంగళవారం రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Taking a swipe at the BJP-led government over both rising unemployment issue and Anil Ambani's company's involvement in the Rafale fighter jet deal, Congress president Rahul Gandhi on Wednesday said that the Prime Minister is on a "KILL India program".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X