వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్త

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో టాక్స్ కుంభకోణం వెలుగుచూసింది. ఇండియన్ టెక్నోమాక్ కంపెనీ లిమిటెడ్ అధినేత డా.రాకేశ్ శర్మ దాదాపు రూ.3000కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. సేల్స్ టాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కమ్ టాక్స్ లతో పాటు బ్యాంకు రుణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

2014లో వెలుగులోకి:

2014లో వెలుగులోకి:

రాకేశ్ శర్మ పన్ను ఎగవేత కుంభకోణం 2014లోనే వెలుగులోకి వచ్చింది. రాకేశ్ శర్మకు చెందిన మాన్యుఫక్చరింగ్ కంపెనీల టర్నోవర్ అకస్మాత్తుగా భారీ ఎత్తున పెరగడంతో కుంభకోణం బయటపడింది. ఆర్థిక దర్యాప్తు సంస్థలు, స్టేట్ ఎక్సైజ్, పన్ను సంస్థలు కలిసి ఈ కుంభకోణాన్ని బయటపెట్టాయి.

 ప్రభుత్వాధికారులను ప్రలోభ పెట్టి..

ప్రభుత్వాధికారులను ప్రలోభ పెట్టి..

హిమాచల్ ప్రదేశ్ 'ప్రత్యేక హోదా'ను కలిగి ఉండటం వల్ల కేంద్రం ఇక్కడి కంపెనీలకు పన్ను రాయితీ ఇచ్చింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పన్ను రేటు తక్కువే. దీన్ని ఆసరాగా చేసుకుని డా.రాకేశ్ శర్మ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు చెబుతున్నారు.

రాకేశ్ శర్మ కుంభకోణాలకు ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలున్నాయి. లంచాల ద్వారా వారిని ప్రలోభ పెట్టి గత నాలుగేళ్ల నుంచి సేల్స్, ఎక్సైజ్ ట్యాక్స్ లను ఎగవేశాడని అంటున్నారు.

బిల్లుల్లో తేడాలు..:

బిల్లుల్లో తేడాలు..:

రాకేశ్ శర్మకు సిర్మూర్ జిల్లాలోని మజ్రా, పవొంట సాహిబ్ ప్రాంతాల్లో మెటల్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 2009నుంచి వీటి ప్రొడక్షన్ మొదలైంది.

అయితే ఈ ప్రొడక్షన్ కేవలం పేపర్ మీదే ఉంది తప్ప.. వాస్తవంగా అక్కడ ఎలాంటి ఉత్పత్తి జరగలేదని రాష్ట్ర అధికారులు ఆరోపిస్తున్నారు. కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఈ నిజం బయటపడిందంటున్నారు. ఉత్పత్తికి, వినియోగానికి సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు ఉన్నాయని వారు చెబుతున్నారు.

 చార్టెడ్ అకౌంట్ కాస్త ఇండస్ట్రిలియస్టుగా:

చార్టెడ్ అకౌంట్ కాస్త ఇండస్ట్రిలియస్టుగా:

నిజానికి డా.రాకేశ్ శర్మ ఒక చార్టెడ్ అకౌంట్ అని..ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక పారిశ్రామ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆయన పారిశ్రామికవేత్త అవతారం ఎత్తారని విచారణలో తేలింది.

అంతేకాదు, ఓ ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారి కొడుకును తన కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా నియమించుకున్నాడని వెల్లడైంది. మొత్తం కుంభకోణంలో అతను కూడా కీలకంగా వ్యవహరించాడని అంటున్నారు.

 మనీ లాండరింగ్ కూడా..:

మనీ లాండరింగ్ కూడా..:

రాకేశ్ శర్మపై ట్యాక్స్ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి రుణంగా పొందిన డబ్బుతో ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

అయితే ఏయే బ్యాంకుల నుంచి ఎంతమేర రుణం పొందాడన్న దానిపై మాత్రం అంతగా క్లారిటీ లేదు.

పన్ను ఎగవేత కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీని ఆదేశించింది.
ప్రస్తుతం కేసును సమీక్షిస్తున్నామని, త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ తెలిపారు.

 ఆస్తుల స్వాధీనం..:

ఆస్తుల స్వాధీనం..:

ట్యాక్సులతో పాటు కరెంటు బిల్లులు కూడా ఎగవేసిన డా.రాకేశ్ శర్మ కంపెనీలో కార్మికులకు కూడా వేతనాలు చెల్లించలేదని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కుంభకోణం సంగతి వెలుగుచూడటంతో.. అతనికి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఆలస్యంగా మేల్కొన్నాయి.

ఆస్తుల వేలం ద్వారా ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా రూ.300కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. రాకేశ్ శర్మ కంపెనీ ఆస్తులు హిమాచల్ తో పాటు, ఏపీ, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, మేఘాలయల్లో ఉన్నట్టు గుర్తించారు.

English summary
An estimated Rs 3,000 crore tax scam has rocked the small hill state Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X