• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వంద కాదు రెండొందలు కాదు రూ.32 వేల 500 ఫైన్.. చలానా చూసి ఖంగుతిన్న ఆటో యజమాని..!!

|

గురుగ్రామ్ : కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. హెల్మెట్ పెట్టుకోలేదని టూవీలర్ రైడర్‌కు నిన్న రూ.23 వేల ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారుడు లబోదిబోమనగా .. మిగతా రైడర్లు కూడా ఆందోళన చెందారు. ఇదిలాఉంటే నిన్న గురుగ్రామ్ పరిధిలో ఆటోకు కూడా భారీమొత్తంలో జరిమానా విధించారు. రూ.32 వేల 500 ఫైన్ వేయడంతో ఆటో యాజమాని మహ్మద్ ముస్తాకిల్ బోరుమని విలపించాడు.

ఆటోకు రూ.32,500 ఫైన్

ఆటోకు రూ.32,500 ఫైన్

కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ఆటో రిక్షా యజమానికి ఫైన్ వేశారు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముస్తాకిల్ పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చారు. గత 15 ఏళ్ల నుంచి గురుగ్రామ్‌లో ఉంటున్నారు. నిన్న సికందర్‌పూర్ వద్ద గల సెక్టార్ 26 రహదారిపై రెడ్‌లైట్ పడింది. రెడ్ లైట్ పడిన ఆటో రిక్షాను యధేచ్చగా వెళ్లాడు. దీంతో నిబంధనలను అతిక్రమించారని భావించి ఫైన్ వేశారు. ఆటోను నిలిపి .. పేపర్లు చూపించాలని కోరారు. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడం చూసి ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. ఆటో రిక్షాకు సంబంధించిన డాక్యుమెంట్లను డీఎల్ఎఫ్ ఫేజ్-3 వద్ద వదిలేశానని అతని చెప్పారు. తనకు 10 నిమిషాల సమయం ఇస్తే ఆర్సీ, సీ బుక్ తీసుకొస్తానని చెప్పారు. వారిని అర్థించిన ప్రయోజనం లేకపోయింది. ఆటో యజమాని మాటను ట్రాఫిక్ పోలీసులు లెక్కచేయలేదు.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

ముస్తాపిల్‌ ఆటోకు ట్రాఫిక్ పోలీసులు రూ.32 వేల 500 ఫైన్ చేశారు. చాలానాలో దానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో మరో రూ.5 వేలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రూ.2 వేలు, ఎయిర్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో రూ.10 వేలు, సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకపోవడంతో రూ.500, భయంకరంగా ఆటో నడుపుతున్నందుకు రూ.5 వేలు, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినందుకు మరో రూ.5 వేల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే టూవీలర్ రైడర్‌కు కూడా ఇలాంటి కారణాలతోనే జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతి

ఫైన్ కట్టకపోవడంతో ..

ఫైన్ కట్టకపోవడంతో ..

ముస్తాకిల్ ఆటోకు రూ.32 వేల 500 ఫైన్ వేయడంతో ఆయన కట్టలేకపోయాడు. దీంతో ఆటోను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని తన లాయర్‌కు వెల్లడించి ఆటో రిక్షాను తీసుకొస్తానని ముస్తికిల్ చెప్తున్నారు. ఇప్పుడు తన వద్ద అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తనకు విధించిన చాలానా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త వాహన చట్ట సవరణ బిల్లుకు జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On the day a two-wheeler rider was fined Rs 23,000 for not wearing a helmet and travelling without relevant papers, the Gurugram traffic police also issued a challan of Rs 32,500 to an auto-rickshaw driver on Tuesday after the Motor Vehicles (Amendment) Act , which steeply raised penalties for traffic violations, came into force two days ago. Mohammed Mustakil, the auto-rickshaw driver, was stopped by a traffic police officer when he allegedly jumped a red light in Sikanderpur, Sector 26, on Tuesday. When the official asked him to show his documents, he said he realised that he had left them at home in DLF Phase-3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more