వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ,ఆయన మంత్రివర్గ విమానాయాన ఖర్చు రూ.393 కోట్లు

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎక్కువగా విదేశాంగా విధానం మీద దృష్టి సారించారు. అంతర్జాతీయ సంబంధాల కోసం పలు దేశాలను సైతం చుట్టివచ్చాడు. ఈనేపథ్యంలోనే ఆయనపై విమర్శలు సైతం వచ్చాయి. దేశీయ సమస్యలు పట్టించుకోకుండా విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నాడే విపక్షాల విమర్శలు కూడ ఎదుర్కోన్నారు. అయితే ఇన్ని సార్లు విదేశాలకు వెళ్లిన ప్రధాని మోడీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ఎన్నిసార్లు విదేశీయాత్రలు చేశారు. విదేశీ ప్రయాణంలో వారు ప్రయాణం కోసం పెట్టిన ఖర్చు ఎంతా ..వారు దేశీయ విమానాల ప్రయాణాల్లో ఎంత ఖర్చు పెట్టారు అనే దానిపై రైట్ టూ ఇన్మర్మేషన్ ద్వార ఓ సామాజీక కార్యకర్త రాబట్టాడు.

ముంబాయి ఆర్టీఐ కార్యకర్త సమాచారం

ముంబాయి ఆర్టీఐ కార్యకర్త సమాచారం

కాగా ముంబయి నగరానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త ఒకరు ఈ వివరాలను సేకరించారు. ప్రధానమంత్రిగా 2014 నుండి గత డిశంబర్ వరకు మొత్తం ఐదు ఆర్ధిక సంవత్సారాల్లో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆయన మంత్రి వర్గం విదేశీ ప్రయాణాలతోపాటు దేశీయ ప్రయాణల కోసం మొత్తం ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారంటూ ఆర్టీఐ సమాచారంలో కోరాడు.

మోడీ తోపాటు క్యాబినెట్ ప్రయాణ ఖర్చులు

మోడీ తోపాటు క్యాబినెట్ ప్రయాణ ఖర్చులు

సామాజీక కార్యకర్త ధాఖలు చేసిన వివరాల్లో మాత్రం మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు మొత్తం 393 కోట్ల రుపాయలు ఖర్చయినట్టు పేర్కోన్నారు. అందులో స్టేట్ ఇండిపెండెంట్ మంత్రులు గాక ప్రధాన మంత్రి కేబినెట్ మంత్రులు రూ. 263 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం ఇచ్చారు. అందులో 48 కోట్ల రుపాయలను దేశీయ ప్రయాణాల కోసం ఖర్చు పెట్టారు. ఇక స్టేట్ మంత్రులు రూ.29 కోట్లు విదేశీ ప్రయాణం కోసం ,ఖర్చు పెట్టగా, 53 కోట్ల రుపాయలు స్వదేశీ ప్రయాణాల కోసం ఖర్చుపెట్టారు. కాగా మొత్తం అటు ప్రధాని , కేబినెట్ మంత్రులు మరియు స్టేట్ మంత్రుల ఖర్చు 393 కోట్ల 58 లక్షల రుపాయలు ఖర్చు అయినట్టు సమాచార శాఖ తెలిపింది.

49 సార్లు మోడీ విదేశీ ప్రయాణం

49 సార్లు మోడీ విదేశీ ప్రయాణం

ఇక ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఫిబ్రవరి 22 నుండి 2019 వరకు మొత్తం ప్రభుత్వ అధికారిక వైబ్ సైట్ ప్రకారం 49 సార్లు ఫారిన్ ట్రిప్ చేశాడు.కాగా 2014-15 ఆర్ధిక సంవత్సరంలో లోనే మోదీతోపాటు మంత్రివర్గం 88 కోట్ల రుపాయలను విదేశీ ప్రయాణాలకు అధికమొత్తంలో వెచ్చించారు. మరోవైపు ప్రధాన మంత్రి దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఢిఫెన్స్ మినిస్ట్ర్రి నుండి ఖర్చుపెడతారాని ,విదేశీ ప్రయాణాల కోసం క్యాబినెట్ మంత్రుల ప్రయాణ వ్యయాల నుండి నిధులు కేటాయిస్తారని తెలిపారు.

పారదర్శకత లేని లెక్కలు

పారదర్శకత లేని లెక్కలు

అయితే గతంలో కూడ ఇదే అంశంపై రాజ్యసభలో చర్చకు వచ్చిన నేపథ్యంలోనే మోడీతోపాటు ఆయన సహచర మంత్రుల ప్రయాణల ఖర్చుపై అడిగిన వివరాలకు గాను సమాధానంగా మోడీ చార్టెడ్ ఫ్లైట్స్ తో ఇతర సభ్యుల ప్రయాణాలకు గాను మొత్తం 2021 కోట్లు ఖర్చు అయినట్టు సమాధానం చెప్పారు. కాగా మరో ఆర్టీఐ కార్యకర్త అడిగిన సమాచారానికి గాను రూ 311 కోట్ల రుపాయలు అయినట్టు సమాచారం ఇచ్చారు.

ప్రయాణ ఖర్చులను పబ్లిక్ డొమైన్ ఉంచాలి

ప్రయాణ ఖర్చులను పబ్లిక్ డొమైన్ ఉంచాలి

కాగా విమానా ప్రయాణ ఖర్చుల పై పారదర్శకత లేనట్టుగా కనిపిస్తుందంటూ పలువురు ఆర్టీఐ ద్వార సమాచారం అడిగిన సామాజిక కార్యకర్తు భావిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో మొత్తాన్ని చెప్పడం వెనుక అధికారులు గొప్యాన్నిపాటిస్తున్నారంటూ చెబుతున్నారు. ప్రధానమంత్రితోపాటు మంత్రుల ప్రయాణ ఖర్చులు మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

English summary
A Right to Information (RTI) query has revealed that Prime Minister Narendra Modi and his Council of Ministers incurred an expenditure of Rs 393 crore on foreign and domestic travel in last five fiscal years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X