వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.4 పెంపు?: మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మళ్ళీ రూ.4 పరిగిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: ఇప్పటికే వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల కారణంగా కొద్దిరోజులపాటు ఇంధన ధరల పెంపును వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా కంపెనీల లాభాల్లో కోతపడింది.

ఇప్పుడు వాటిని పూడ్చుకునే ప్రయత్నించవచ్చని ఆర్థకరంగ నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఇంధన సరఫరా కంపెనీల లాభాల స్థాయిని అందుకోవాలంటే మరో రూ.4 పెంచాల్సి ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు గత సోమవారం ఇందన ధరల సమీక్షను మళ్లీ మొదలుపెట్టాయి.

Rs 4 a litre hike in petrol, diesel prices coming up, say brokerage firms

19 రోజుల విశ్రాంతి అనంతరం ఇందన ధరల సమీక్ష తిరిగి ప్రారంభమైన తర్వాత పెట్రోల్‌ ధర 69పైసలు పెరిగింది. గురువారం ఒక్కరోజే 22పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రల్‌ ధర రూ.75.61కు చేరింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. డీజిల్‌ ధర 86పైసలు పెరిగి రూ. 66.79కు చేరింది.

ఇంధన కంపెనీలకు లభించే స్థూల లాభం రూ.2.7కు చేరుకోవాలంటే రూ.4 కంటే ఎక్కువ ధర పెంచాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 24వ తేదీన 78.84 డాలర్లు ఉన్న చమురు దర 14మే నాటికి 82.98కి చేరుకుంది. దీంతో ఈ మధ్యలో ఇంధన కంపెనీలకు రూ.500 కోట్ల మేరకు నష్టాలు వాటిల్లినట్లు సమాచారం.

ముంబైలో కూడా పెట్రోలు ధరలు భారీగా పెరిగాయి. ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 83.45గా, డీజిల్ ధర రూ. 71.42గా ఉంది. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కూడా నష్టాలను మరింత ప్రభావితం చేశాయి.

English summary
A Rs 4 per litre increase in petrol and diesel prices is in the offing if state-owned fuel retailers are to return to pre-Karnataka poll hiatus margin levels, brokerage firms said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X