వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణ రంగానికి నిధుల వరద... ఎంతో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పాటు ఉగ్ర వాదుల నుంచి ముంపు పొంచివుండటంతో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా గత ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్ కంటే అదనంగా లక్ష కోట్ల రుపాయలను కేటాయించారు. దీంతో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ శాఖకు గాను 4 లక్షల 31వేల కోట్ల రుపాయాలను కేటాయించింది.

కాగా ఇది మొత్తం బడ్జెట్‌లో 15.47 శాతంగా ఉంది. కాగా కేటాయించిన మొత్తాన్ని రక్షణ రంగంలోని ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవి , ఎయిర్ ఫోర్స్ పరిషోధన రంగాలుగా విభవించి ప్రత్యేకంగా వాటికోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతా రామన్ తెలిపారు.

Rs 431,010.79 crore allocated to the defence sector of the total Budget

ఇక గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా మూడు లక్షల కోట్లను కేటాయించారు..దీనికి అదనంగా మరో లక్ష ముప్పై వేల కోట్ల రుపాయలను పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈనేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇండియన్ బడ్జెట్ 5 ట్రిలియన్లకు చేరుతుందని ,దీంతో సంక్షేమ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని యూనియన్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ స్కీమ్‌ను అమ‌లు చేశామ‌ని మంత్రి తెలిపారు. ఫలితంగా సైనికుల జీతాల‌ను కూడా గ‌ణ‌నీయంగా పెంచామ‌న్నారు.

English summary
Union Finance Minister Nirmala Sitharaman Friday allocated Rs 431,010.79 crore to the defence sector amounting 15.47 per cent of the total Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X