వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండాకుల కోసం రూ.50 కోట్లు.. ఎలా బయటపడింది?: ఎవరీ దినకరన్?

అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం టీటీవీ దినకరన్ రూ.50 కోట్ల వరకు ఎన్నికల కమిషన్‌కు ముట్ట చెప్పాలనుకున్న అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆర్కే నగర్ ఎన్నికలు ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం టీటీవీ దినకరన్ రూ.50 కోట్ల వరకు ఎన్నికల కమిషన్‌కు ముట్ట చెప్పాలనుకున్న అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆర్కే నగర్ ఎన్నికలు ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే.

షాకింగ్: ఈసికి రూ.1.30 కోట్ల లంచం ఇవ్వబోయి బుక్కైన దినకరన్, ఉక్కిరి బిక్కిరి షాకింగ్: ఈసికి రూ.1.30 కోట్ల లంచం ఇవ్వబోయి బుక్కైన దినకరన్, ఉక్కిరి బిక్కిరి

ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం శశికళ వర్గం, పన్నీరుసెల్వం వర్గం పోటీ పడ్డాయి. ఈసీ మాత్రం దానిని ఫ్రీజ్ చేసింది. దీంతో ఎలాగైనా రెండాకుల గుర్తును సంపాదించాలని శశికళ వర్గం ఆర్కే నగర్ అభ్యర్థి టిటివి దినకరన్ భావించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఇవ్వాలనుకున్నారు.

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు దినకరన్ పేరు చెప్పడంతో పోలీసులు ఆయనపై దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ కేసులో ఓ నిందితుడు అయిన సుఖేష్ చందర్ నుంచి పోలీసులు రూ.1.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎలా పట్టుబట్టాడంటే..?

ఎలా పట్టుబట్టాడంటే..?

శశికళ అల్లుడు టిటివి దినకరన్ రెండాకుల గుర్తు కోసం రూ.50 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం పోలీసులు వ్యాపారి, నిందితుడు అయిన సుఖేష్ చందర్ నుంచి రూ.1.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా దినకరన్ పేరు వచ్చింది. దినకరన్ రూ.50 కోట్లు ఈసీకి చెల్లించాలనుకున్నాడని తెలిపారు.

ఈ కేసు కోసం జాయింట్ కమిషనర్ ప్రవీర్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. వీరు దినకరన్‌ను కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. అయితే, ఈసీ అధికారులకు వ్యతిరేకంగా మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

తాము సుఖేష్ చందర్‌ను విచారించామని, కానీ ఆయన ఎవరి పేరు చెప్పడం లేదని అంటున్నారు. సుఖేష్ వయస్సు 27 ఏళ్లు. ఇతనిపై.. గతంలో రాజకీయ నాయకులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

తెరపైకి దినకరన్

తెరపైకి దినకరన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం శశికళ అన్నాడీఎంకేలో తెరపైకి వచ్చారు. ఆమె తెరమీదకు తెచ్చిన పేరు దినకరన్. శశికళ జైలుకు వెళ్లే సందర్భంలో మరింత మార్మోగింది. ప్రస్తుతం పార్టీ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న ఆయనను జయ నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో గెలిపించుకునేందుకు శశికళ వర్గం ముమ్మరయత్నాలు చేస్తోంది.

అయితే ఓటర్లకు డబ్బుపంచుతున్నారంటూ అక్కడి ఉపఎన్నికను ఈసీ వాయిదా వేసింది. తాజాగా పార్టీ రెండాకుల గుర్తు కోసం భారీమొత్తంలో లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ... ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో దినకరన్‌పై మళ్లీ చర్చమొదలైంది.

ఎవరీ దినకరన్?

ఎవరీ దినకరన్?

దినకరన్ వీకే శశికళకు స్వయానా మేనల్లుడు. థేని జిల్లాకు చెందిన ఆయనకు భాస్కరన్, సుధాకరన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరిలో సుధాకరన్‌ను జయలలిత దత్తపుత్రుడిగా స్వీకరించారు. అయితే తర్వాత బహిరంగంగా ఆయనను దూరం పెడుతున్నట్టు ప్రకటించారు.

శశికళ జైలుకెళ్లడంతో..

శశికళ జైలుకెళ్లడంతో..

జయలలిత మృతి అనంతరం ఆమె అధికారిక నివాసమైన పోయెస్ గార్డెన్‌లోకి మేనత్త శశికళతో పాటు దినకరన్ అడుగుపెట్టారు. జయలలిత అంత్యక్రియల సందర్భంగా ఆయన శశికళ పక్కనే కనిపించారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఫిబ్రవరి 15న దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించారు.

జయలలిత బహిష్కరిస్తే... దినకరన్ పైన కేసులు

జయలలిత బహిష్కరిస్తే... దినకరన్ పైన కేసులు

అయిదేళ్ల క్రితమే జయలలిత దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు రావడంతో ఆమె దినకరన్‌ను దూరంపెట్టారు. అంతకు ముందు దినకరన్ లోకసభ, రాజ్యసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు.1991-95 మధ్య దినకరన్ ఖాతాల్లో భారీ సొమ్ములు డిపాజిట్ కావడంపై ఈడీ ఆయనపై విదేశీ మారకద్రవ్యం నిబంధన ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది.

కేసులపై ట్విస్ట్

కేసులపై ట్విస్ట్

తాను సింగపూర్ పౌరుడినంటూ ఈడీని బురిడీ కొట్టించేందుకు దినకరన్ ప్రయత్నించారు. అయినప్పటికీ ఈడీ ఆయనను దోషిగా నిలబెట్టింది.1996 కేసులో ఈడీ విధించిన రూ.25 కోట్ల జరిమానా చెల్లించాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పింది.

ఇప్పుడు ఆర్కే నగర్..

ఇప్పుడు ఆర్కే నగర్..

ఈ నెల 12న జరగాల్సిన ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో దినకరన్ ఏఐఏడీఎంకే తరపున పోటీలో ఉన్నారు. అయితే అక్రమంగా డబ్బు పంచుతున్నారన్న ఆరోపణలలో ఈసీ ఇక్కడి ఉప ఎన్నికను వాయిదా వేసింది. మరోవైపు, శశికళపై తిరుగుబాటు చేసిన ఓ పన్నీర్సెల్వం వర్గీయులను మాతృపార్టీలోకి తీసుకొచ్చేందుకు దినకరన్ ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

English summary
It was a high profile case which mandated a special team to be formed. The Crime Branch of the Delhi police learnt that there were attempts on to allegedly bribe officials in the Election Commission of India in the wake of the symbol row within the AIADMK between the Sasikala and O Panneerselvam factions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X