వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప మీద రూ. 50 కోట్లకు పరువునష్టం దావా, నోటీసులు ఇచ్చిన డీజీపీ !

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్న డీజీపీ సత్యనారాయణ రావ్.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్న డీజీపీ సత్యనారాయణ రావ్ ఆమెకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప ఆరోపించారు.

శశికళ ఎఫెక్ట్: మరో లేఖతో కలకలం, జైల్లో చాల మంది వీవీఐపీలు, ఖరీదైన దంపతులు!శశికళ ఎఫెక్ట్: మరో లేఖతో కలకలం, జైల్లో చాల మంది వీవీఐపీలు, ఖరీదైన దంపతులు!

డీఐజీ రూప చేసిన ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డీజీపీ సత్యనారాయణ రావ్ న్యాయవాది పుత్తిగే ఆర్. రమేష్ డీఐజీ రూపకు నోటీసులు జారీ చేశారు. డీజీపీ సత్యనారాయణ రావ్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పడానికి డీఐజీ రూపకు మూడు రోజులు గడువు ఇచ్చారు.

బహిరంగ క్షమాపణ

బహిరంగ క్షమాపణ

తన కక్షిదారుడు డీజీపీ సత్యనారాయణ రావ్ ఎవ్వరి దగ్గర లంచం తీసుకోకపోయినా డీఐజీ రూప అనవసరంగా ఆరోపణలు చేశారని, ఆయన పరువుకు భంగం కలిగే విధం మాట్లాడారని, అందుకు మూడు రోజుల్లోగా ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపించారు.

Recommended Video

Sasikala Natrajan's security beefed up in Karnataka Central jail | Oneindia News
రూ. 50 కోట్లకు పరువునష్టం దావా !

రూ. 50 కోట్లకు పరువునష్టం దావా !

డీజీపీ సత్యనారాయణ రావ్ కు మూడు రోజుల్లోగా డీఐజీ రూప బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఆయన న్యాయవాది రమేష్ అన్నారు. అనవసరంగా తన సీనియర్ అధికారి మీద ఆరోపణలు చేసిన డీఐజీ రూపను కచ్చితంగా కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

దేశ వ్యాప్తంగా తెలిసింది

దేశ వ్యాప్తంగా తెలిసింది

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, ఆమె కుటుంబ సభ్యుల దగ్గర డీజీపీ సత్యనారాయణ రావ్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ డీఐజీ రూప పై అధికారులు, ప్రభుత్వానికి లేఖ రాయడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని న్యాయవాది రమేష్ అన్నారు.

డీజీపీ గౌరవం ఏం కావాలి ?

డీజీపీ గౌరవం ఏం కావాలి ?

అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన విషయం దేశవ్యాప్తంగా తెలిసింది. అలాంటి శశికళ విషయంలో డీఐజీ రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారని, డీజీపీ సత్యనారాయణ రావ్ లంచం తీసుకున్నారని మాట్లాడుకోవడంతో ఆయన గౌరవానికి భంగం కలిగిందని న్యాయవాది రమేష్ చెప్పారు.

రూప ఏం చెబుతారు ?

రూప ఏం చెబుతారు ?

డీజీపీ సత్యనారాయణ రావ్ న్యాయవాది రమేష్ పంపించిన నోటీసులు తనకు అందాయని కానీ, అందలేదు అని కానీ ఇంత వరకు డీఐజీ రూప చెప్పలేదు. డీజీపీ సత్యనారాయణ రావ్ పంపించిన నోటీసులకు డీఐజీ రూప ఏం సమాధానం చెబుతారో ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

English summary
50 crore defamation case notice against DIG Roopa by DGP Satyanarayana Rao lawyer. Roopa alleged on Satyanarana Rao about bribe from VK Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X