వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 60 లక్షలు సీజ్: గాలి డబ్బు అంటు ప్రచారం ?

|
Google Oneindia TeluguNews

హెబ్బళి/బళ్లారి: కర్ఱాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ. 60 లక్షలు సీజ్ చేశారని హుబ్ళళిలో వార్తలు గుప్పుమన్నాయి. స్వాధీనం చేసుకున్న రూ. 60 లక్షలు ఎవరిది ? అని కర్ణాటకలోని కేశ్వాపుర పోలీసులు ఆరా తీస్తున్నారు.

సోమవారం హోసపేట నుంచి హబ్బళికి స్కార్పియో వాహనం (కేఏ-35,ఎం-8395) వాయు వేగంతో వచ్చింది. తరువాత కేశ్వాపుర పోలీసులకు అనుమానం వచ్చి ఆ వాహనం నిలిపారు. వాహనంలో పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1,000, రూ.500 నోట్ల కట్టలను పోలీసులు గుర్తించారు. స్కార్పియో వాహనంలో ఉన్న శ్రీనివాస మూర్తి, ప్రవీణ్ జైన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు, నగదు సీజ్ చేశారు.

Rs 60 lakhs of 500, 1000 rupees note seized by Hubballi police

హోస్ పేట నుంచి హుబ్బళికి వచ్చిన వీరిద్దరు పెద్ద నోట్లను ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే అది సాధ్యం కాకపోవడంతో మళ్లీ హోస్ పేట వెలుతున్న సమయంలో పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు.

పెళ్లి ఖర్చుల కోసం తాము రూ. 60 లక్షల పెద్దనోట్లు మార్చడానికి ఇక్కడికి వచ్చామని శ్రీనివాస మూర్తి, ప్రవీణ్ జైన్ విచారణలో అంగీకరించారని పోలీసులు అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన డబ్బు సీజ్ చేశారని హుబ్బళితో పాటు కర్ణాటక మొత్తం ఈ వార్త గుప్పుమంది.

Rs 60 lakhs of 500, 1000 rupees note seized by Hubballi police

ఈ డబ్బు ఎవరిది ? అని తాము విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ డబ్బును తరలించి మార్చడానికి ప్రయత్నించారని పుకార్లు వచ్చాయి.

అయితే పోలీసు అధికారులు మాత్రం మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సీజ్ చేసిన రూ. 60 గాలి జనార్దన్ రెడ్డిది అని మాత్రం పోలీసు అధికారికంగా దృవీకరించలేదు. మొత్తం మీద పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత కర్ణాటకలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది ఇదే మొదటి సారి.

English summary
60 lakhs rupees of 500, 1000 rupees note seized by Hubballi police on Monday. There is a rumor that, amount belongs to former minister Janardhana reddy ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X