వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటన

|
Google Oneindia TeluguNews

వారణాసి : ఒకటి కాదు రెండు కాదు .. రూ. 618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. అదీ కూడా ఓ ప్రభుత్వ పాఠశాలకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు నెలల్లో ఆ పాఠశాల వాడిన బిల్లు మొత్తం రూ.618 కోట్ల అట. యూపీ విద్యుత్ అధికారుల తీరు ఇలా ఉంది. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపాల్ షాక్‌నకు గురయ్యారు. తమ స్కూల్ ‌కెంటి ఇంత బిల్లు రావడం ఏంటీ అని ఆశ్చర్యపోయారు. ఈ పాఠశాల సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఉండటం విశేషం.

యూపీలోని వారణాసిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ స్కూల్ ఉంది. అయితే ఈ పాఠశాలకు రెండునెలల పవర్ బిల్‌ను ఇటీవల విద్యుత్ సిబ్బంది ఇచ్చారు. ఆ బిల్లు చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోరేళ్ల బెట్టాడు. అవును ఆ స్కూల్‌కు వచ్చిన కరెంట్ బిల్లు రూ.618 కోట్లు. దీనిపై పాఠశాల సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులను కూడా సంప్రదించారు. ఎక్కడ ఏదైనా లోపం జరిగిందా ? అని ఆరాతీశారు. కానీ ఎక్కడ ఏ లోపం జరగలేదని .. రూ.618 కోట్లు కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. అంతేకాదు ఈ నెల 7 లోపు బిల్లు కట్టాలని హుకుం జారీచేశారు. లేదంటే పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామని పేర్కొన్నారు.

Rs 600 crore electricity bill sends UP school into tizzy

యూపీలో మంగళవారం నుంచే కరెంట్ చార్జీలు పెంచారు. ఈ క్రమంలోనే పాఠశాలకు కూడా దిమ్మతిరిగే పవర్ బిల్ వచ్చింది. అర్బన్ డొమెస్టిక్‌, కమర్షియల్ కరెంట్ చార్జీ ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత మేర పెంచారు. పట్టణాల్లో 12 శాతం కరెంట్ చార్జీలు పెరిగాయి. అందులో ఇండస్ట్రీకి సంబంధించి 12 శాతం ధరలు పెంచారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ బిల్లు కనీసం రూ.400 నుంచి రూ.500కు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండేళ్ల క్రితం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 12.73 శాతం పవర్ బిల్లు పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పవర్ బిల్లు పెంచింది.

English summary
Uttar Pradesh school has got an electricity bill of Rs 618.5 crore for two months of power consumption. The school is located in Varanasi district, the parliamentary constituency of Prime Minister Narendra Modi. Shocked at the amount of the electricity bill, the school authorities approached the power department to seek clarification. But they now complain that the department was not forthcoming in clarifying whether it was an error on its part. The school has been asked to clear the dues to by September 7 failing which electricity supply could be disconnected. The school management said it does not have the means to pay such a hefty amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X