వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కొడుకు నామినేషన్, రూ. లక్షల్లో ప్రజల ఆస్తికి హాని, మూడు ఎఫ్ఐఆర్ లు, హీరోకు షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు, మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసిన సందర్బంలో రూ. 8 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని కేసు నమోదు చేశారు. నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసే సందర్బంలో ప్రజల ఆస్తికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని కేసు నమోదు చెయ్యలేదని అధికారులు అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు, చాల సంతోషం, జేడీఎస్, కాంగ్రెస్ కు షాక్, ఓటర్లు!లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు, చాల సంతోషం, జేడీఎస్, కాంగ్రెస్ కు షాక్, ఓటర్లు!

కావేరీ గార్డెన్స్

కావేరీ గార్డెన్స్

నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసే సందర్బంలో కావేరీ గార్డెన్స్ లోని పూల కుండీలు, పూల చెట్లు, ఫౌంటేన్, విద్యుత్ తీగలు, విద్యుత్ స్థంభాలు, లాన్ లు ద్వంసం అయ్యాయని, అందువలన దాదాపు రూ. 8 లక్షలు నష్టం జరిగిందని ఫ్లాయింగ్ స్కాండ్ రవి ఫిర్యాదు చేశారని అధికారులు అంటున్నారు.

మూడు కేసులు

మూడు కేసులు

మండ్య లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసే సమయంలో నియమాలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ మీద మూడు కేసులు నమోదు అయ్యాయి. మండ్య కసబా ఫ్లయింగ్ స్కాడ్ రవి ఫిర్యాదు మేరకు 1 ఎఫ్ఐఆర్, మండ్య కసబా 1 ఫ్లయింగ్ స్కాడ్ సుధామ ఫిర్యాదు మేరకు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని మండ్య పశ్చిమ విభాగం పోలీసులు తెలిపారు.

ఓటర్లకు వల

ఓటర్లకు వల

మండ్యలోని జయచామరాజేంద్ర సర్కిల్ లో అనుమతి లేకుండా పచ్చ, తెలుపు రంగు కాగితాలు ఉన్న పోట్లాలు కాల్చి హంగామా చేశారని, ఈ విదంగా ఓటర్లకు వల వెయ్యడానికి జేడీఎస్ ప్రయత్నించిందని సుధామ ఫిర్యాదు చేశారని మండ్య పశ్చిమ విభాగం పోలీసులు తెలిపారు.

హీరోలు గో బ్యాక్ !

హీరోలు గో బ్యాక్ !

మండ్య లోక్ సభ నియోజక వర్గంలో నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసిన తరువాత ఆ నియోజక వర్గంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. జేడీఎస్ కార్యకర్తలు ఇప్పుడు మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్న చాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ ఫేం యష్ మీద విరుచుకుపడ్డారు. దర్శన్, యష్ గో బ్యాక్ అంటూ జేడీఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. హీరోలు దర్శన్, యష్ అభిమానులు, జేడీఎస్ కార్యకర్తలు పరస్పర నినాదాలతో ఆ ప్రాంతాలు మార్మోగిపోతున్నాయి.

English summary
Election flying squad reported that 8 lakh rupees worth public assets were destroyed during nikhil kumaraswamy nomination. Three different FIR are registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X