వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్ ఇవేం ధరలు: అక్కడ ఉల్లి ధరలు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్..!

|
Google Oneindia TeluguNews

ప్రయాగరాజ్ (యూపీ): అకాల వర్షాలు, వాతావరణంలో అనుకోని మార్పులతో ఈ సారి కూరగాయల ధరలు ఉత్తర్‌ప్రదేశ్‌లో కొండెక్కి కూర్చున్నాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్లుగా తయారైంది ఉల్లి పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలకు ఉల్లి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కొనకముందే వాటి ధరను చూసి కళ్లకు నీళ్లు వస్తున్నాయి.

అటు అసెంబ్లీ ఎన్నికలు..ఇటు ఉల్లి ధరల ఘాటు: కమలనాథుల్లో కలవరంఅటు అసెంబ్లీ ఎన్నికలు..ఇటు ఉల్లి ధరల ఘాటు: కమలనాథుల్లో కలవరం

 కిలో ఉల్లి రూ.80

కిలో ఉల్లి రూ.80

ఉత్తర్ ప్రదేశ్‌లో ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. కిలో ఉల్లి ధర రూ.80 పలుకుతోంది. ఇందుకు కారణం ఉల్లి స్టాక్ లేకపోవడమే అని తెలుస్తోంది. అకాల వర్షాలకు ఉల్లి పంటతో పాటు పలు పంటలు ధ్వంసం అయ్యాయి. అంతకుముందు కిలో ఉల్లి ధర రూ.40 నుంచి 50 మధ్యలో ఉండేదని రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయని కూరగాయలు అమ్మేవారు చెబుతున్నారు. ఇక టమాటా ధర కూడా ఎర్రగా మండుతోంది. అయితే ధరలు నియంత్రణలోకి వచ్చేందుకు మరో 2 నుంచి 3వారాల సమయం పడుతుందని కూరగాయలు అమ్మేవారు చెబుతున్నారు.

 రూ.100 అయినా సరే పెట్టి కొనాల్సిందే

రూ.100 అయినా సరే పెట్టి కొనాల్సిందే

ఇక ఉల్లి ధరలు పెరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. ఉల్లి ధర ఎంతున్న సరే కొనక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఉల్లి లేనిదే వంటకు రుచి ఉండదు కదా అని చెబుతున్న వినియోగదారులు రూ.100 అయినా సరే కిలో ఉల్లి కొనాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు మాత్రం ఉల్లిని బంగారంతో పోలుస్తున్నారు. అంత డబ్బులు చెల్లించి ఉల్లి కొనాలంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర కూరగాయల ధరల్లోను కనిపిస్తున్న పెరుగుదల

ఇతర కూరగాయల ధరల్లోను కనిపిస్తున్న పెరుగుదల

కూరగాయల ధరల పెరుగుదల ఇంతకు మునుపెన్నడూ ఈ స్థాయిలో లేదని చెబుతున్నారు. ఒకప్పుడు బియ్యం, పప్పు దినుసుల ధరల్లో పెరుగుదల కనిపించేదని ఇప్పుడు వీటితో పాటు ఈ జాబితాలోకి కూరగాయలు కూడా చేరిపోయాయని చెబుతున్నారు వినియోగదారులు. ఈ ధరలతో పేద ప్రజలు మూడుపూట్ల కడుపు నిండా తినలేకపోతున్నారని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

ఇదిలా ఉంటే చండీఘడ్‌లో కూడా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. వర్షాలకు అక్కడ కూడా ఉల్లి పంట దెబ్బతినింది. చండీగఢ్‌లో సోమవారం రోజున ఉల్లి ధర రూ.70 ఉండగా... మంగళవారానికి అది రూ. 10 పెరిగి రూ.80కి చేరింది. ఇక మార్కెట్‌కు ఉల్లి సప్లై కూడా తగ్గిపోయిందని వెండర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం ఉల్లి టమాటాలపై సమీక్ష నిర్వహించింది. త్వరలోనే ధరలను నియంత్రణలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

English summary
Unseasonal rains and unusual weather conditions have led to a hike in the prices of different vegetables, primarily Onions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X