వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజుకుంటున్న రిజర్వేషన్ల మంట: నిన్న మాయావతి..నేడు ప్రియాంక గాంధీ!

|
Google Oneindia TeluguNews


న్యూఢిల్లీ
: రిజర్వేషన్ల అమలు తీరుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. రిజర్వేషన్ల అంశాన్ని ముట్టుకుంటే.. దేశం భగ్గున మండిపోతుందంటూ బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించి 24 గంటలు గడవకముందే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన గళాన్ని వినిపించారు. పున:సమీక్ష పేరుతో రిజర్వేషన్ల వ్యవస్థను ఎత్తేయడానికి చాపకింద నీరులా కుట్ర సాగుతోందని ఆమె ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా డిమాండ్లను తీసుకొచ్చి, రిజర్వేషన్ల పున: సమీక్షించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, వాటిని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. రిజర్వేషన్ల వ్యవస్థ పున: సమీక్షకు సరైన వాతావరణం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికి రిజర్వేషన్ల ఫలాలు అందట్లేదని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. రిజర్వేషన్లపై నరేంద్ర మోడీ- అమిత్ షా ద్వయం కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు.

‘RSS-BJP’s real target is social justice’: Priyanka hits out at Bhagwat over reservation remark

మోహన్ భగవత్ చేసిన ఈ ప్రకటన పట్ల రాజకీయ ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. నిప్పు లేనిదే పొగరాదని, ఈ వ్యవస్థను ఎత్తేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందనే విషయం మోహన్ భగవత్ మాటల ద్వారా తేటతెల్లమైందని మాయావతి విమర్శించారు. తాజాగా- ప్రియాంక గాంధీ వాద్ర అదే గళాన్ని అందిపుచ్చుకున్నారు. సామాజిక అసమతౌల్యానికి దారి తీసేలా నరేంద్ర మోడీ-అమిత్ షా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం గొంతు కోసే ప్రయత్నాలకు వారిద్దరు తెర తీశారని ధ్వజమెత్తారు. దీనిపై ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ అసలు లక్ష్యం.. సామాజిక న్యాయమేనని ఆమె ధ్వజమెత్తారు. సామాజిక న్యాయాన్ని ఛిద్రం చేసేలా నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చ పేరుతో.. రిజర్వేషన్లను ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్-బీజేపీ, నరేంద్ర మోడీ-అమిత్ షా ప్రధాన లక్ష్యమని అన్నారు. వారి ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra Tuesday hit out at the RSS, a day after its chief Mohan Bhagwat called for a conversation between those in favour of reservation and those against it. Alleging that the Narendra Modi-led government was throttling pro-people laws, Priyanka said the “real target” of the RSS-BJP was social justice. “The confidence of the RSS is high and intentions are dangerous. At a time when the BJP government is throttling pro-people laws, the RSS has also raised the issue of debate on reservation,” she said in a tweet in Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X