• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటీటీలు, డ్రగ్స్, బిట్ కాయిన్స్ తో జాతి వ్యతిరేక చర్యలు- ఆరెస్సెస్ ఛీఫ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా తాజాగా చోటు చోసుకుంటున్న పరిణామాలపై ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన ఓటీటీలు, డ్రగ్స్ తో పాటు బిట్ కాయిన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసేలా ఉన్నాయి.

ఆరెస్సెస్ ఛీఫ్ సంచలన కామెంట్స్

ఆరెస్సెస్ ఛీఫ్ సంచలన కామెంట్స్

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు సిద్ధాంతపరమైన మద్దతుదారుగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. దేశంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతోంది. ఈ ప్రభావం ఇవాళ దసరా సందర్భంగా ఆరెస్సెసె హెడ్ క్వార్టర్ట్ నాగ్ పూర్ లో జరిగిన ఉత్సవాలపైనా కనిపించింది.

ఇందులో పాల్గొన్న ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్.. జాతి వ్యతిరేక కార్యకలాపాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే సర్కార్ ను ఇబ్బందిపెట్టేందుకు జాతి వ్యతిరేకశక్తులు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నాయన్న అర్ధంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

బిట్ కాయిన్ తో ఆర్ధిక వ్యవస్ధకు చేటు

బిట్ కాయిన్ తో ఆర్ధిక వ్యవస్ధకు చేటు

ప్రస్తుతం పాపులర్ క్రిప్టో కరెన్సీగా ఉన్న బిట్ కాయిన్ పై ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విదేశీ కరెన్సీల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ గాడి తప్పుతుందని భగవత్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ చర్యలకు ఈ కరెన్సీ ఉపయోగపడుతోందని భగవత్ సంచలన కామెంట్స్ చేశారు.

ఇప్పటికే దేశంలో బిట్ కాయిన్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆరెస్సెస్ ఛీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఎన్డీయే సర్కార్ బిట్ కాయిన్ ను నేరుగా అడ్డుకోలేని పరిస్ధితుల్లో ఉన్న నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు కేంద్రం నిస్సహాయతను సూచిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.

 ఓటీటీలపై నియంత్రణ ఏదీ?

ఓటీటీలపై నియంత్రణ ఏదీ?

దేశంలో ప్రస్తుతం విచ్చలవిడి ప్రసారాలతో చెలరేగిపోతున్న ఓటీటీలపైనా ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై నియంత్రణ ఏదీ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓటీటీల్లో అన్ని విధాలైన కంటెంట్ అందుబాటులో ఉంటోందని, కరోనా తర్వాత పిల్లల చేతుల్లోకి ఫోన్లు వచ్చేశాయని, వాటికి పిల్లలు అలవాటు పడిపోయారని భగవత్ తెలిపారు. ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్లలో పిల్లలు ఏం చూస్తున్నారో ఎవరికి తెలుసని మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు ప్రశ్నించారు. ఓటీటీలపై నియంత్రణ విషయంలో కేంద్రం చేతులెత్తేస్తున్న నేపథ్యంలో భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

డ్రగ్స్ ను అడ్డుకోవడమెలా?

డ్రగ్స్ ను అడ్డుకోవడమెలా?

దేశంలోకి ఇప్పుడు అన్నిరకాల డ్రగ్స్ ప్రవేశిస్తున్నాయని, వాటిని అఢ్డుకోవడమెలా అని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరో కీలక ప్రశ్న వేశారు. దేశంలోకి వస్తున్న డ్రగ్స్ కు జనం అలవాటు పడిపోతున్నారని, వాటిని ఎలా నియంత్రించాలో తనకూ తెలియడం లేదన్నారు. తాజాగా బయటపడిన ఆర్యన్ ఖాన్ కేసును ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటోంది. ఎన్సీబీని రంగంలోకి దించి అతనికి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు కేంద్రం నిస్సహాయతను గుర్తు చేస్తున్నట్లు ఉన్నాయి.

ఈ సొమ్ముతోనే విదేశీ జాతి వ్యతిరేక చర్యలు

ఈ సొమ్ముతోనే విదేశీ జాతి వ్యతిరేక చర్యలు

ప్రస్తుతం దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందా, ఓటీటీలు, బిట్ కాయిన్స్ ద్వారా వస్తున్న సొమ్ముపైనా మోహన్ భగవత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తోందో అందరికీ తెలుసన్నారు. వీటిని వాడుకుంటూ విదేశాలు భారత్ లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మోహన్ భగవత్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో డ్రగ్స్, బిట్ కాయిన్స్ ను ఉగ్రవాదులు వాడుకుంటున్నట్లు ఆధారాలు లభిస్తున్న వేళ భగవత్ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఎన్డీయే సర్కార్ వీటిని ఎందుకు కట్టడి చేయలేకపోతోందన్న దానిపై మాత్రం ఆయన సమాధానం చెప్పకపోవడం విశేషం.

English summary
RSS chief Mohan Bhagwat on today launched sharp attack against OTT platforms, the narcotics trade, and Bitcoin and said those all for funding "anti-national activities".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X