వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అలాంటివాడు ఒక్కడున్నా భారత్ ‘హిందూదేశమే’..ఆర్ఎస్ఎస్ అంటే అంత సులభం కాదు’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏదో ఒక నిర్ధిష్ట భావజాలానికి బంధీ కాదని.. ప్రత్యేకమైన వాదాన్ని లేదా సిద్ధాంతాన్ని విశ్వసించడం లేదని సంఘ్ అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్‌ఎన్‌ను ఒక పుస్తకానికి పరిమితం చేయలేమని, ఎన్నో ఆలచనల సమాహారం కూడా కాదని అన్నారు.

ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్

హిందువుల దేశం..

హిందువుల దేశం..

ఆర్ఎస్ఎస్ రెండవ అధినేత, సంఘ్ ప్రధాన నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్ గోళ్వల్కర్ ప్రసంగాల సంకలనమని ఆయన వ్యాఖ్యానించారు. హిందుస్థాన్ అంటే హిందువుల దేశమని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెగ్డేవార్ వ్యాఖ్యానించారని మోహన్ భగవత్ చెప్పారు.

అలాంటివాడు ఒక్కడున్నా.. హిందూ దేశమే..

అలాంటివాడు ఒక్కడున్నా.. హిందూ దేశమే..

‘ది ఆర్ఎస్ఎస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ది 21వ సెంచరీ'అనే పుస్తుకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోహన్ భగవత్ ప్రసంగించారు. ‘వారసత్వంగా వచ్చిన ఈ సత్యాన్ని మేము విశ్వసిస్తాము. మేము దాన్ని మార్చలేము. హిందువు అని చెప్పుకునే వాడు ఒక్కడు ఉన్నా ఇది హిందూ దేశంగానే పరిగణించబడుతుంది' అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కదానికీ బంధీ కాదు..

ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కదానికీ బంధీ కాదు..

సంఘ్ భావజాలం అంటూ ఏమీ లేదు.. సంఘ్‌కు ఏదో ఒక భావజాలం ఉండాల్సిన అవసరం కూడా లేదు అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సంఘ్‌ను నిర్వచించడానికి విదేశీ భాషల్లో సరైన పదజాలం లేదని అన్నారు.
‘ది ఆర్ఎస్ఎస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ది 21వ సెంచరీ'అనే పుస్తుకం ఆర్ఎస్ఎస్ విలువలను, దూరదృష్టిని వాలంటీర్లకు తెలిపేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం సులభం కాదు..

ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం సులభం కాదు..


సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు ఈ పుస్తకం సహాయకంగా ఉంటుందని చెప్పారు. ఈ పుస్తకం చదవడం ద్వారా ఆర్ఎస్ఎస్‌పై మోపబడిన తప్పుడు భావనలు తొలగిపోతాయని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఏదో ఒక భావజాలానికి ఆర్ఎస్ఎస్ పరిమితం కాదని, ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం కూడా అంత సులభమేమీ కాదని అన్నారు. సర్ సంఘ్ చాలక్ అయిన తర్వాత నుంచే తనకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలిసిందని గురూజీ(గోళ్వాల్కర్) వ్యాఖ్యానించారని తెలిపారు

వారంతా హిందువులే..

వారంతా హిందువులే..

ఆర్ఎస్ఎస్ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హనుమాన్, మరాఠా రాజు శివాజీ, హెగ్డేవార్ తమకు మార్గదర్శకులని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. భారతదేశం హిందూ దేశం.. దాన్ని ఎవరూ మార్చలేరు. తమను తాము హిందువులమని కాకుండా భారతీయులమని చెప్పుకునేవారు, భారతదేశం తమ మాతృభూమి అని చెప్పుకునేవారు కూడా హిందువులేనని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
The RSS cannot be bound by one specific ideology, or any ideologue, nor does the organisation believe in any particular “ism”, or doctrine, Sangh chief Mohan Bhagwat said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X