వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రచ్చరచ్చ: ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పు, సీపీఐ (ఎం) ర్యాలీపై నాటు బాంబులతో దాడి!

|
Google Oneindia TeluguNews

కణ్ణూరు/కొచ్చి: కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటోంది. తాజాగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పటించడంతో పరిస్థితులు చెయ్యిదాటి పోయాయి.

<strong>హీరో దిలీప్ తో కేరళ పోలీసులు సెల్ఫీలు, వైరల్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా!</strong>హీరో దిలీప్ తో కేరళ పోలీసులు సెల్ఫీలు, వైరల్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా!

ప్రతీకారంతో సీపీఐ(ఎం) నాయకులపై నాటు బాంబులతో దాడులు చేశారు. కేరళలోని కణ్ణూరు జిల్లాలోని పయ్యణ్ణూరు లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పంటించారు.

నిప్పంటించడంతో ఆర్ఎస్ఎస్ కార్యాలయం పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ లేరని పోలీసులు అంటున్నారు. సీపీఐ (ఎం) కార్యకర్తలు కార్యాలయానికి నిప్పటించారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

RSS office attacked in Kannur in Kerala

<strong>పోలీసు కస్టడీకి మలయాళం హీరో దిలీప్, బెయిల్ ఇస్తే గోవిందా, అందర్నీ బెండ్ తీస్తే!</strong>పోలీసు కస్టడీకి మలయాళం హీరో దిలీప్, బెయిల్ ఇస్తే గోవిందా, అందర్నీ బెండ్ తీస్తే!

గత సంవత్సంర జులై 12వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సీపీఐ (ఎం) కార్యకర్త ధనరాజ్ ను హత్య చేశారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ధనరాజ్ పుణ్యతిథి సందర్బంలో బుధవారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్బంలో సీపీఐ (ఎం) నాయకుల మీద మూడు నాటు బాంబులు విసిరారు.

ఈ బాంబుల దాడిలో నలుగురు సీపీఐ (ఎం) కార్యకర్తలకు గాయాలైనాయి. బీజేపీ నాయకులే మా మీద బాంబులు విసిరారని సీపీఐ (ఎం) నాయకులు ఆరోపించారు. ఈ రెండు ఘటనలు జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, సీపీఐ (ఎం) కార్యకర్తలు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కణ్ణూరు జిల్లాలో కేరళ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
An RSS office at Payyannur has been attacked on Tuesday night allegedly by CPI-M workers.No one was inside it at the time of the incident in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X