వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్ ప్రపంచ విజయాన్నికాంక్షిస్తుంది.. మోహన్ భగవత్

|
Google Oneindia TeluguNews

అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కొత్త సవాళ్లను అధిగమిస్తారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ చట్టంపై కూడ ఆయన ఇన్‌డైరక్ట్‌గా స్పందించారు. ఈ సంధర్బంగా దేశంలో కొందరు ఏవేవో ఊహించుకొని విద్వేషాలురెచ్చగొట్టి దుఖాన్ని తెచ్చుకుంటున్నారంటూ.. వాళ్లు ప్రపంచాన్నికూడా దుఖంతో నింపేయాలని చూస్తున్నారని, అన్నారు... అయితే... నీతి, న్యాయం, ధర్మం వంటి విలువలపై సానుకూల ఆలోచనా దృక్పథం లేకపోవడం సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.

హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరుగిన ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప సభకు భారీగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిధిగా హజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గోన్నారు. సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ అధికారిక ప్రతినిధి మురళీధర్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా మోహన్ భగవత్ పలు అంశాలు ప్రస్తావించారు.

RSS seeks world success : Mohan Bhagwat

ముఖ్యంగా స్వార్థం కోసం కొంతమంది ఇతరులను భయపెట్టి పైకి వస్తారని , ఇలాంటీ వారు దేశానికి చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్దికి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ.. ఊరుకుంటే ఏ పనులు కావని అన్నారు. ఈ నేపథ్యంలోనే సమాంలో పరివర్తన అనేది వచ్చినప్పుడే.. దేశం అభివృద్ది పథంలో నడుస్తుందని ఆయన చెప్పారు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఎప్పుడు వ్యక్తిగత స్వార్థం, కోసం పాకులాడరని ఆయన అన్నారు.

English summary
RSS Chief Mohan Bhagwat participated in RSS Public Meeting at Hyderabad. he told that New people will overcome new challenges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X