వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్లను ఎత్తేయడానికి మోడీ-అమిత్ షా కుట్ర: దేశం భగ్గుమనడం ఖాయం: మాయావతి!

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా .. రిజర్వేషన్ల వ్యవస్థను పున:సమీక్షించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి పరిస్థితి తలెత్తితే.. దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతాయని హెచ్చరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఇదేనని ఆమె విమర్శించారు. ఈ మేరకు సోమవారం మాయావతి వరుస ట్వీట్లను సంధించారు.

<strong>చెన్నై బీచ్ లో వింత వెలుగు: రాత్రి వేళ నీలం రంగును సంతరించుకున్న సంద్రం!</strong>చెన్నై బీచ్ లో వింత వెలుగు: రాత్రి వేళ నీలం రంగును సంతరించుకున్న సంద్రం!

మోహన్ భగవత్ మాటలపై ఆందోళన..

రిజర్వేషన్లను పున:సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన తన మాటలను సమర్థించుకున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ సంస్థ జ్ఝాన్ ఉత్సవ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రిజర్వేషన్ల పున:సమీక్ష అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని అంటూనే.. అసలైన లబ్దిదారులకు దాని ఫలాలు అందట్లేదని అన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను పున:సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందంటూ మోహన్ భగవత్ వెల్లడించారు. రిజర్వేషన్ల అమలు విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, రిజర్వేషన్లను రూపొందించే సమయంలో కొన్ని వర్గాలు తమకు అనకూలంగా వాటిని మలచుకున్నాయని అన్నారు. మెజారిటీ వర్గ ప్రజల గళాన్ని వినిపించకుండా చేశారని చెప్పారు.

భగ్గుమన్న మాయావతి..

రిజర్వేషన్ల వ్యవస్థపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మాయావతి భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థమేంటని ఆమె నిలదీశారు. రిజర్వేషన్ల వ్యతిరేక అభిప్రాయాన్ని తక్షణమే మార్చుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆర్థిక స్థితిగతులను మెరుగు పర్చడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నానికి తెర తీశారని మాయావతి ఆరోపించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని మోహన్ భగవత్ డిమాండ్ చేయడం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరగాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారామె. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల పురోభివృద్ధి కోసం రాజ్యాంగం మానవతా దృక్పథంతో రిజర్వేషన్ల వ్యవస్థను తెర మీదికి తీసుకొచ్చిందని, దీనికి జోలికి వెళ్లాల్సిన పనే లేదని అన్నారు.

Recommended Video

Lok Sabha Election 2019 : సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురు!! || Oneindia Telugu

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి:


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అనేక శాఖల్లో లక్షలాది సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని మాయావతి డిామాండ్ చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులను నిలిపివేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. రిజర్వేషన్ వ్యవస్థను పున:పరిశీలించాలనే కుట్రతో ప్రభుత్వ శాఖల్లో భర్తీలను కేంద్రం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలను నిషేధించడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదేనని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడం వల్ల కూడా పేదరికాన్ని నిర్మూలించవచ్చని హితవు పలికారు. బ్యాక్ లాగ్, ఇతర పోస్టులను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా పేదరిక నిర్మూలన అసాధ్యమని అన్నారు.

English summary
BSP chief Mayawati on Monday asked the RSS to shed its "anti-reservation mindset", saying reservation was a constitutional provision and disturbing it would be an injustice. A day after Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat said there should be a conversation in a harmonious atmosphere between those in favour of reservation and those against it, Mayawati said such a debate would generate a dangerous situation of doubt which was not needed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X