కేరళలో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య: ఉద్రిక్తత

కేరళలో మరో ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ అనే వ్యక్తిని గురువారం దారుణంగా కత్తులతో పొడిచి చంపారు.

కొచ్చి: కేరళలో మరో ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ అనే వ్యక్తిని గురువారం దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేశారు. మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫైజల్ పుల్లనీ అలియాస్ అనీష్ కుమార్ హత్య కేసులో విపిన్ నిందితుడిగా ఉన్నాడు. 8నెలల కిందట ఇస్లాం మతంలోకి మారాడన్న కారణంతో ఫైజల్‌ను దుండగులు కొట్టి చంపారు. ఈ దండగుల బృందంలో ఒకడిగా ఉన్న విపిన్ వారం రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యాడు.

murder

కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యర్థులను కిరాతకంగా హతమారుస్తోందని ఆరెస్సెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టులోనే 34ఏళ్ల ఓ ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం మద్దతుదారులే అతడ్ని చేతులు నరికి చంపినట్లు ఆరోపణలున్నాయి.

కేరళలో వామపక్ష ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దాదాపు 30మందికిపైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపిన్ హత్య జరగడంతో ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. దీంతో పోలీసులు జిల్లాలో భారీగా మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+