• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాద్వీ మరో కాంట్రవర్సీ : ఎంపీగా ప్రమాణం చేసేప్పుడు గురువు పేరు, విపక్ష సభ్యుల అభ్యంతరం

|

న్యూఢిల్లీ : సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. వివాదాస్పదాలకు కేంద్ర బిందువు. ఎన్నికల్లో ప్రచారం నుంచి మొత్తం సాద్దీ చుట్టే రాజకీయ విమర్శలు జరిగాయి. ఎన్నికలు ముగిసి సభ కొలువుదీరినా . సాద్వీ వైఖరి మాత్రం మారలేదు. మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ తాను అనేలా వ్యవహరించారు. లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేసే సందర్భంలోనూ ఆమె వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది.

 గురువు పేరు జోడించడంతో ..

గురువు పేరు జోడించడంతో ..

17వ లోక్ సభ కొలువుదీరాక .. ఇవాళ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ కొందరు సభ్యులచేత ప్రమాణం చేయించారు. అందరిలానే వచ్చిన సాద్వీ మాత్రం తన పేరుకు తోక జోడించడంతో వివాదం చెలరేగింది. సంస్క‌ృతంలో ప్రమాణం చేసిన ఆమె .. సాద్వీ ప్రజ్ఞాసిగ్ ఠాకూర్ పూర్ణ్ చేత్‌నంద్ అద్వేశానంద్ గిరి అంటూ ప్రమాణం చేశారు. దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సాద్వీ ప్రమాణంలో పేర్ల గురించి ఆరాతీశారు. అయితే తన గురువు స్వామి ఆద్వేశానంద గిరి పేరు జోడించి చెప్పానని సాద్వీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిని విపక్షాలు కార్నర్ చేశారు.

తేడా ఎందుకు ?

తేడా ఎందుకు ?

ఎన్నికల అఫిడవిట్‌లో లేని పేరును ప్రమాణం చేసేటప్పుడు మాత్రం ఎందుకు ఉచ్చరిస్తారని ప్రశ్నించారు. సభా నియమ, నిబంధనల ప్రకారం పేరుకు తోకలు జోడించడం కుదరని విపక్షాలు తేల్చిచెప్పడంతో .. గొడవకు పీక్ స్టేజీకి చేరింది. సాద్వీ ఉచ్చరించిన పదాలను రికార్డు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ హామీనిచ్చారు. అయినా విపక్షాలు మాత్రం వినలేదు. దీంతో లోక్ సభ అధికారులు కల్పించుకొని .. మీరు ప్రమాణం చేసే సమయంలో మీ తండ్రి పేరు జోడించారా అని ప్రశ్నించారు.

చరల్యు తప్పవన్న ..?

చరల్యు తప్పవన్న ..?

అలాగే ఎన్నికల అఫిడవిట్‌ను ప్రొటెం స్పీకర్ పరిశీలించారు. అలాగే సాద్వీ ఎన్నికైన ఎన్నికల పత్రాన్ని అందజేయాలని ఎన్నికల సంఘాన్ని స్పీకర్ ఆదేశించారు. దీనిపై సరైన చర్యలు తీసుకున్నందున సభ సజావుగా నడిచేందుకు సభ్యులంతా సహకరించాలని ప్రొటెం స్పీకర్ కోరారు. సభ్యుల నిరసనల మధ్య సాద్వీ తన ప్రమాణ స్వీకార ప్రక్రియను ముగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాద్వీ బోఫాల్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ గట్టి పోటీనిచ్చారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులోనూ సాద్వీ నిందతురాలు అయిన సంగతి తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
the Lok Sabha today saw ruckus as Pragya Singh Thakur took oath as the newly elected member of the house. While taking oath of duty Pragya Singh Thakur took name of her guru. Taking oath in Sanskrit, she said, "I...Sadhvi Pragya Singh Thakur Poorn Chetnand Avdheshanand Giri", which the Opposition members objected to saying she modified the wordings of oath. They said the name of her guru, Swami Avdheshanand Giri was not mentioned in the record that she submitted in the election affidavit and taking that name is not allowed under the rules. Pro-tem Speaker Virendra Kumar said he will get the record verified and take cognizance accordingly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more