• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Twitter షాకింగ్ రిప్లై: సొంత రూల్స్ పాటిస్తాం -పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం -భారత చట్టాలే సుప్రీం అని హితవు

|

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్ లో కార్యకలాపాలు, కొత్త ఐటీ చట్టాలపై కొన్నాళ్లుగా మోదీ సర్కారుతో విభేదిస్తోన్న ట్విటర్ ఇప్పుడు ఇంకాస్త హద్దులు దాటింది. దేశం ఏదైనప్పటికీ, తాము సంస్థాగతంగా నిర్ధారించుకున్న నిబంధనలను మాత్రమే పాటిస్తామంటూ షాకింగ్ సమాధానమిచ్చింది. అసలే ట్విటర్ పై నిశేధం తప్పదేమోననే వాదనల నడుమ ఈ పరిణామం ఉత్కంఠ రేపుతున్నది..

covid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటేcovid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటే

సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం, నిబంధనల బేఖాతరు, మార్గదర్శకాల లేమి తదితర అంశాలపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించింది. నోటీసులు ఇచ్చిమరీ ట్విటర్ సంస్థ ప్రతినిధులు, ఐటీ శాఖ అధికారులను తన ముందుకు పిలుపించుకున్న కమిటీ.. పలు అంశాలపై అటు ట్విటర్ ను, ఇటు కేంద్రాన్ని కీలక ప్రశ్నలడిగింది. కాగా,

rule of land supreme, not your own policy: Parliamentary panel tells Twitter on new it rules

మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన ఐటీ చట్టాలను తొలి నుంచీ వ్యతిరేకిస్తోన్న ట్విటర్.. పార్లమెంటరీ కమిటీ ముందు కూడా అదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. భారత చట్టాలకంటే కూడా సంస్థాపరంగా తాము రూపొందించుకున్న చట్టాలనే కచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉంటామని ట్విటర్ ఇండియా ప్రతినిధులు చెప్పగా, ఆ వివరణపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

''ట్విటర్ పాలసీలో పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సంస్థాగతంగా పారదర్శకంగా ఉంటూనే భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రైవసీ(గోప్యత) పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తాం. ఆన్‌లైన్‌లో పౌరుల హక్కులను పరిరక్షించడమూ కీలకాంశమే. సంబంధిత అంశాలపై ప్రభుత్వంతోగానీ, పార్లమెంటరీ కమిటీతోగానీ కలిసి పనిచేయడానికి ట్విట్టర్ సర్వదా సిద్ధంగా ఉంది'' అని ఆ సంస్థ ప్రతినిధులు బదులివ్వగా..

Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?

''ఏదైనా సంస్థ ఒక దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడి స్థానిక చట్టాలే సుప్రీం అన్న సంగతిని ట్విటర్ మర్చిపోరాదు, ఐటీ నిబంధనలకు సంబంధించి భారత చట్టాలే అత్యుతన్నతమైనవి తప్ప, మీకై మీరు ఏర్పాటు చేసుకున్నవి గొప్పవి కాబోవు'' అంటూ పార్లమెంటరీ ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ చట్టాలను కచ్చితంగా అమ‌లు చేయాల్సిందేన‌ని ట్విటర్ కు నిర్దేశించింది. అంతేకాదు,

దేశీయ‌ చట్టాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పార్లమెంటరీ కమిటీ ట్విటర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగ‌తి తెలిసిందే. గ‌డువులోగా కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్‌ పాటించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు టూల్‌కిట్‌ వ్యవహారం, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, ఆరెస్సెస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌హా పలువురు ప్రముఖల ఖాతాలకు బ్లూ టిక్‌ తొలగింపు అంశాలు ఈ దూరాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే. ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ ఎంపీ శ‌శి థ‌రూర్ అధ్య‌క్ష‌ుడిగా ఉన్నారు.

English summary
Amid a tussle between the Union government and Twitter over the new IT rules, members of a parliamentary panel on Friday strongly objected to Twitter India officials' observations that they abide by their policy and categorically told them that the rule of land is supreme. According to sources, members of the Parliamentary Panel on Information Technology also asked Twitter why it should not be fined as it has been found "violating" rules of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X