వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేకిన్ ఇండియా: అణు ఇంధనం ఉత్పత్తికి భారత్‌కు రష్యా సహకరిస్తుందన్న పుతిన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌర అణుశక్తి ఉత్పత్తిని ప్రమోట్ చేసేందుకు రష్యా సహకారాన్ని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. రష్యాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆదేశ అధ్యక్షుడు పుతిన్‌‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అణు ఇంధనంపై చర్చించారు. కొన్ని వారాల క్రితం రష్యాకు చెందిన ఇంధనం సంస్థ టీవీఈఎల్ వైస్ ప్రెసిడెంట్ ఓలెగ్ గ్రిగొరెవ్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్‌లో న్యూక్లియర్ ఫ్యూయెల్ రాడ్లు అసెంబ్లింగ్ చేయాలనే ఉద్దేశంతో తమ కంపెనీ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అణు ఇంధనం సంయుక్తంగా కలిసి తయారు చేసేందుకు సహకరించాల్సిందిగా రష్యాను కోరింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురుఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీల భేటీ సందర్భంగా పౌర అణు శక్తి ఉత్పత్తిలో భారత్‌కు రష్యా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు.అంతేకాదు తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తామని చెప్పారు.ఇప్పటికే మొదటి రెండు యూనిట్లు పూర్తయి ప్రస్తుతం ఆపరేషన్‌లో ఉన్నాయని... మూడోది నాల్గవ యూనిట్లను కూడా త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు పుతిన్. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాల ప్రకారం రష్యా రూపొందించిన 12 పవర్ యూనిట్ల నమూనాలో రానున్న 20 ఏళ్లలో భారత్‌లో నిర్మిస్తామని చెప్పారు.

Russia will cooperate to produce nuclear fuel in India:Putin

కూడంకుళం అణువిద్యుత్ సంస్థ యూనిట్-3 యూనిట్-4లకు సంబంధించిన పరికరాలు భారత్‌కు పంపామని ఇక ఐదు ఆరు యూనిట్లకు సంబంధించిన అణు పరికరాలను వచ్చే ఏడాది పంపుతామని చెప్పారు. కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టులో రష్యాకు చెందిన వీవీఈఆర్-1000 రియాక్టర్లు ఉన్నాయి. ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 1000 మెగావాట్లు. యూనిట్ -1 దక్షిణ విద్యుత్ గ్రిడ్‌కు అక్టోబర్ 2013లో అనుసంధానించడం జరిగింది. యూనిట్-2 ఆగష్టు 2016లో కనెక్ట్ చేయడం జరిగింది. రెండు యూనిట్లు ఇప్పటి వరకు 27,033 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరిగింది.

English summary
To promote Make in India in civil Nuclear energy production , PM Modi and Russian President Vladimir Putin discussed the possibility of joint production of nuclear fuel in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X