
సరిహద్దులోకి చైనా దూసుకొచ్చినా.. రష్యా భారత్‌కు మద్దతుగా నిలవదు: అమెరికా
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఇప్పుడు భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతోంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేగాక, రష్యాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడటం లేదని భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చైనాను లాగుతూ పలు వ్యాఖ్యలు చేసింది.
ఒకవేళ భారత వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడినా.. భారత్‌కు మద్దతుగా రష్యా రాదని యూఎస్ డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ అన్నారు. చైనా, రష్యాల బంధం విడదీయరానిదని, అవి రెండు పరస్పరం ఎప్పుడూ సహకరించుకుంటూనే ఉంటాయన్నారు. అందుకే రష్యాకు భారత్ మద్దతుగా నిలవడం ఏమాత్రం ఉపయోగం లేదని దిలీప్ సింగ్ వ్యాఖ్యానించారు.

విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లాతో సహా భారతీయ సంభాషణకర్తలతో వరుస సమావేశాలను నిర్వహించిన తర్వాత ఆయన మాట్లాడారు. రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో ఏ దేశం ఆర్థిక లావాదేవీలు జరుపడాన్ని అమెరికా ఇష్టపడదని అన్నారు. భారతదేశం ప్రస్తుత రష్యన్ ఇంధన దిగుమతి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించదని సింగ్ అన్నారు, అయితే అదే సమయంలో వాషింగ్టన్ దాని మిత్రదేశాలు, భాగస్వాములు "విశ్వసనీయమైన సరఫరాదారు"పై తమ ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను కనుగొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Foreign Secretary @harshvshringla met US Deputy National Security Advisor for International Economics & G20 Sherpa Daleep Singh.
— Arindam Bagchi (@MEAIndia) March 31, 2022
Discussed 🇮🇳🇺🇸 economic cooperation & strategic partnership. Look forward to working together on global issues of mutual interest, including in G20. pic.twitter.com/6NkYnteuxe
రష్యాపై అమెరికా ఆంక్షల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ.. ఉక్రెయిన్‌పై దాడిపై రష్యాను విమర్శించకపోవడంపై పాశ్చాత్య శక్తులలో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బుధవారం న్యూఢిల్లీకి వచ్చారు.
'రూబుల్‌కు మద్దతు ఇవ్వడానికి లేదా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అణగదొక్కడానికి లేదా మా ఆర్థిక ఆంక్షలను తప్పించుకోవడానికి రూపొందించబడిన యంత్రాంగాలను చూడడానికి మేము ఇష్టపడం' అని ఆయన మీడియాతో ఉన్నారు. అయితే, భారత్ అవసరాల కోసం చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో తప్పేముందని, ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపాలని తాము కోరుకుంటున్నామని భారత్ చెబుతోంది. అంతేగాక, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని తాము ముందు నుంచి ఉక్రెయిన్, రష్యాలకు చెబుతున్నామని వెల్లడించింది.