వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం కార్డ్ పిన్ లాక్, గుడి ముందు బిచ్చమెత్తుకున్న రష్యా యువకుడు, స్పందించిన సుష్మా

రష్యాకు చెందిన ఓ యువకుడు తమిళనాడులోని కాంచీపురంలో గల కుమరకొట్టం ఆలయం ఎదుట బిచ్చం ఎత్తుకుంటూ కంటపడ్డాడు. ఇది అందరి మదిని కలచివేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Russian Tourist Begging in Chennai, Know Sushma Swaraj's response | Oneindia Telugu

చెన్నై: రష్యాకు చెందిన ఓ యువకుడు తమిళనాడులోని కాంచీపురంలో గల కుమరకొట్టం ఆలయం ఎదుట బిచ్చం ఎత్తుకుంటూ కంటపడ్డాడు. ఇది అందరి మదిని కలచివేసింది.

రష్యాకు చెందిన యువకుడు

రష్యాకు చెందిన యువకుడు

రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్‌ పర్యాటకుడిగా మన దేశానికి వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్‌ను రష్యా స్తంభింపజేసింది.

ఆలయం మెట్లపై కూర్చొని బిచ్చమెత్తుకున్నాడు

ఆలయం మెట్లపై కూర్చొని బిచ్చమెత్తుకున్నాడు

అతని చేతిలో ఏమాత్రం డబ్బు లేదు. అతనికి ఆకలి తీరే మార్గం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు.

 ధన సాయం చేసిన పోలీసులు

ధన సాయం చేసిన పోలీసులు

భక్తుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అతనికి కొంత ధన సహాయం చేశారు. చెన్నైకి వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అతని డాక్యుమెంట్లు, వీసా, పాస్‌పోర్ట్ అన్నింటిని తాము తనిఖీ చేశామని, అన్నీ సరిగానే ఉన్నాయని చెప్పారు.

 స్పందించిన సుష్మా స్వరాజ్

స్పందించిన సుష్మా స్వరాజ్

మరోవైపు అతని విషయమై విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. ఏటీఎం పిన్‌ పని చేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇవాంజెలిన్... రష్యా మా మిత్ర దేశం, చెన్నైలోని మా అధికారి మీకు సహకరిస్తాడని సుష్మా ట్వీట్ చేశారు.

English summary
A Russian man was found sitting at the entrance of the Sri Kumarakottam temple in Kancheepuram in Tamil Nadu on Tuesday, seeking alms, after his ATM card got locked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X