• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా

|

ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జమ్ము కశ్మీర్‌ విభజన బిల్లు, ఆర్టికల్స్ 370, 35A రద్దు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామని చెప్పుకొచ్చారు.

జెండా పండుగతో తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త శోభ సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. తెలుగు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇక ఊరూవాడ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కాలనీలు, యూత్ సంఘాలు, కుల సంఘాలు తదితరులు పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో కూడా త్రివర్ణ పతాకం ఎగురవేశారు నేతలు.

russian president vladimir Putin independence day wishes

ఐదుసార్లు ఎమ్మెల్యే.. హైదరాబాద్‌లో 5 రూపాయల భోజనం.. సింపుల్ మ్యాన్

అదలావుంటే స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న ఇండియా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రష్యా, భారత్ మధ్య సంబంధాలు ఇకపై కూడా కొనసాగాలని.. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడాలని ఆకాంక్షించారు. భారతదేశ ప్రజలకు మరిన్ని విజయాలు కలగాలని.. ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లేఖలో రాశారు. కశ్మీర్ విభజన బిల్లుకు సంబంధించి పాకిస్థాన్ మద్దతు కోరిన నేపథ్యంలో రష్యా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఐరాసతో పాటు సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని పాక్‌కు హితవు పలికింది.

English summary
Russian President Vladimir Putin congratulated India on the occasion of 73rd Independence. In a letter to Prime Minister Narendra Modi and President Kovind, he congratulated India and said that the relations between the two nations are dynamically developing in the spirit of special and privileged strategic partnership. Kindly accept cordial congratulations on the national day of the Republic of India, the Independence Day, the letter stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X