వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాద్‌ మిర్‌ పుతిన్‌ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం అక్టోబరు 4,5 తేదీల్లో పుతిన్‌ ఢిల్లీకి రానున్నారు.

 Russian President Vladimir Putin to visit India in October, hold talks with PM Modi

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులతో పుతిన్‌ అధికారికంగా సమావేశం కానున్నట్లు భారత విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది జూన్‌ 1న జరిగిన ఇరుదేశాల వార్షిక ద్వైపాక్షిక సమావేశానికి మోడీ రష్యా వెళ్లారు.

2000లో పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరినప్పటి నుంచి భారత్‌-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం పుతిన్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయనున్నాయి. ఇరు దేశాల మధ్య సహాయసహకారాలకు తోడ్పాటునందించనున్నాయి.

English summary
Russian President Vladimir Putin will pay an official visit to New Delhi on October 4 and 5 to take part in the 19th India-Russia annual bilateral summit, the MEA said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X