వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతపెడితే ఆత్మహత్యే?: అక్కడి జైల్లో ఓ రష్యన్ తీరిది..

చాలారోజులుగా అతను ఆహారం తీసుకోవడం లేదని తోటి ఖైదీ జైలర్లకు సమాచారం ఇవ్వడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రష్యా ఖైదీ సెర్జీ అన్న పానీయాలను ముట్టడం లేదు. చాలారోజులుగా అతను ఆహారం తీసుకోవడం లేదని తోటి ఖైదీ జైలర్లకు సమాచారం ఇవ్వడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

సెర్జీ ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ.. సెర్జీ మాత్రం ఆహారం తినేందుకు ససేమిరా అంటున్నాడు. బలవంతంగా తినిపించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు.

Russian prisoner goes on hunger strike

కాగా, పాస్ పోర్టు లేకుండా అక్రమంగా ఇండియాలో ఉన్నాడన్న కారణంగా సెర్జీని జులై 1న ఉత్తరకాశీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మరుసటి రోజు తెహ్రీ జైలుకు పంపించడంతో.. అప్పటినుంచి జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఆహారం తినడం మానేసి పరోక్షంగా తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. సెర్జీ వద్ద పాస్ పోర్టు లేదని రూఢీ అయిన తర్వాతే పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.

English summary
A Russian national, lodged in Uttarakhand's Tehri jail has gone on hunger strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X