• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ లో హోరాహోరీ ప్రచారం...! వ్యవస్థలను నాశనం చేయడమే మమత లక్ష్యమన్న మోదీ..!!

|

కలకతా: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రచార సమయాన్ని కుదించింది. బెంగాల్లో చివరి విడత పోలింగ్‌ జరుగుతున్న తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఒక రోజు ముందు గురువారం రాత్రే ముగించాలని ఆదేశించింది. నిజానికి శుక్రవారం రాత్రి పది గంటల వరకు ప్రచారానికి గడువు ఉంది. ఇతర రాష్ట్రాల్లో పోలింగ్‌ జరుగుతున్న 50 నియోజకవర్గాల్లో ప్రచారం యథాతథంగా శుక్రవారం రాత్రి ముగుస్తుంది. బెంగాల్ చెల రేగిన ఉద్రిక్త పరిస్థితులపై మమత, ప్రధాని మోదీ పరస్పర ఆరోపణలు చేసుకోవడం కొసమెరుపు.

బెంగాల్ లో చివరి విడత ప్రచారం..! చెలరేగుతున్న ఆదిపత్య పోరు..!!

బెంగాల్ లో చివరి విడత ప్రచారం..! చెలరేగుతున్న ఆదిపత్య పోరు..!!

పశ్చిమబెంగాల్‌లో నేటితో ప్రచారం ముగియనుండటంతో పలు పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా తమ ప్రచారంలో మునిగిపోయాయి. ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో హింస చెలరేగడం, రాజకీయ పార్టీల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ప్రచారాన్ని ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. దీంతో సమయం లేకపోవడంతో తృణమూల్‌, బీజేపీలు పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమయ్యాయి.

మమత పై మండి పడ్డ మోదీ..! అరాచక శక్తిగా మారిందని ఆరోపణ..!!

మమత పై మండి పడ్డ మోదీ..! అరాచక శక్తిగా మారిందని ఆరోపణ..!!

ప్రధాని మోదీ మధురాపూర్‌, డుమ్‌డుమ్‌లలో ఎన్నిక ప్రచారం సాగించాలని నిర్ణయించగా, మమతా బెనర్జీ ఏకంగా నాలుగు చోట్ల రోడ్‌ షోలు నిర్వహణకు నిర్ణయించారు. నార్త్‌ 24 పరగణాలు, డైమండ్‌ హార్బర్‌, సౌత్‌వెస్ట్‌ పరగణాలు, కోల్‌కతాలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నార్త్‌ 24 పరగణాలలో ర్యాలీ పూర్తి చేసుకుని డైమండ్‌ హార్బర్‌ చేరుకుంటారు. ఆ తర్వాత వరుస రోడ్డు షోల్లో పాల్గొంటారు. మోదీ మధ్యాహ్నం 4.30 గంటలకు మధురాపూర్‌లోను, సాయంత్రం 6.10 గంటకు డుమ్‌డుమ్‌లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు. ఇలా రెండు పార్టీల మధ్య ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది.

మమతా గూండా గిరి..! ఎక్కువ కాలం నడవదన్న బీజేపి..!!

మమతా గూండా గిరి..! ఎక్కువ కాలం నడవదన్న బీజేపి..!!

ప్రజాస్వామ్యాన్ని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గూండాస్వామ్యంగా మార్చేశారని నరేంద్రమోదీ విమర్శించారు. తృణమూల్‌ గూండాలు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ ధోరణి ఇకపై ఎంతమాత్రం చెల్లదని స్పష్టంచేశారు. అధికారంలో కొనసాగే హక్కు మమతకు లేదన్నారు. కోల్‌కతాలో రాజకీయ హింస నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. బెంగాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటానికి మమత కారణమని, ప్రతీదీ నాశనం చేయడమే ఆమె లక్ష్యమని మోదీ ఆరోపించారు.

వ్యాపారాలపై ప్రభావం..! రెచ్చిపోతున్న అల్లరి మూకలు..!!

వ్యాపారాలపై ప్రభావం..! రెచ్చిపోతున్న అల్లరి మూకలు..!!

వేధింపుల సర్కారును సాగనంపడానికి బెంగాల్‌ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని టకీ, డైమండ్‌ హార్బర్‌, ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌, బిహార్‌లోని పాలీగంజ్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు. బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలను చూసి మమత భయపడుతున్నారు. అధికార మత్తుతో ప్రజాస్వామ్యం గొంతు నులమాలని ప్రయత్నిస్తున్నారు. డైమండ్‌ హార్బర్‌ నుంచి పోటీ చేస్తున్న మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ దుకాణం మూతపడడం ఖాయం అని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Various parties are conducting competitive campaigns in West Bengal. The BJP, along with the ruling party Trinamool Congress, has been immersed in their campaign. In the wake of the violence in Bengal as part of the campaign, and the political parties' complaints, the Central Election Commission has been stopping campaigning here today after 10 o'clock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more