• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జరిగింది అది కాదు: ఆధారాలు ఎలా మాయం అయ్యాయ్?, ప్రద్యుమన్ హత్య వెనుక సంచలనాలు..

|
  Ryan School Pradyumn’s Case : Too Many Questions Remain Unanswered

  నవంబర్: సెప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని రియాన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమన్‌ హత్యకు గురవడం ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రద్యుమన్‌ హత్యకు సంబంధించి తొలుత స్కూల్ బస్ కండక్టర్ పై ఆరోపణలు వచ్చాయి.

  కీలక మలుపు: పరీక్ష వాయిదా వేసేందుకే ప్రద్యుమన్ హత్య, సీనియరే హంతకుడు

  తాను అసహజ శృంగారానికి పాల్పడుతున్న సమయంలో చూసినందువల్లే ప్రద్యుమన్‌ను కండక్టర్ హత్య చేసి ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ తాజా సీబీఐ దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. 11వ తరగతి చదువుతున్న విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేసినట్టు నిర్దారించారు.

   సెలవు కోసం ఘోరం:

  సెలవు కోసం ఘోరం:

  చదువుల్లో పూర్ అయిన నిందితుడు టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ వాయిదా వేసేందుకు తర్జనభర్జన పడ్డాడు. ఏం చేస్తే మీటింగ్ వాయిదా పడుతుందో అతనికి అంతుచిక్కలేదు. ఆ ఆలోచనలు తీవ్ర స్థాయికి చేరి ఏకంగా హత్యకు దారితీశాయి. స్కూలుకు సెలవు రావాలంటే హత్య జరగాలని నిర్ణయించుకున్నాడు. తానే హత్య చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఎవరిని చంపాలో అర్థం కాలేదు. చివరకు ప్రద్యుమన్ అనే రెండో తరగతి విద్యార్థిని బలవంతంగా బాత్రూమ్ లోకి లాక్కెళ్లి గొంతు కోసి హత్య చేశాడు.

   ఇలా దొరికాడు:

  ఇలా దొరికాడు:

  స్కూల్ బస్ కండక్టరుపై ఆరోపణలు రావడంతో పోలీసులు తొలుత అతన్ని విచారించారు. కానీ అతని నుంచి ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. స్కూలు ఆవరణలోని సీసీ టీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించారు.ప్రద్యుమన్‌ హత్యకు ముందు ఆ బాత్‌రూమ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరిగినవారిని గుర్తించారు. టీచర్లను, విద్యార్థులను, సిబ్బందిని కూడా విచారించారు. చివరకు 11వ తరగతి విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేశాడని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాళ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

   నిర్దోషి అంటున్న తల్లిదండ్రులు:

  నిర్దోషి అంటున్న తల్లిదండ్రులు:

  11వ తరగతి విద్యార్థే నిందితుడు అని నిర్దారించుకున్న తర్వాత సీబీఐ అధికారులు తొలుత అతని తల్లిదండ్రులకు విషయాన్ని వివరించారు. మంగళవారం రాత్రి 11.30గం. సమయంలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి తల్లిదండ్రులు మాత్రం తమవాడు నిర్దోషి అంటూ వాపోయారు. హత్య జరిగిన రోజంతా తమవాడు స్కూల్లోనే ఉన్నాడని, పరీక్ష కూడా రాశాడని అంటున్నారు. అతని దుస్తులపై చిన్న రక్తపు మరక కూడా లేదన్నారు. కాగా, నిందితుడు మైనర్ కావడం వల్ల అతని పేరును అధికారులు వెల్లడించలేదు.

   ఆధారాలు ఎలా మాయం?:

  ఆధారాలు ఎలా మాయం?:

  ప్రద్యుమన్ హత్య విషయంలో స్కూల్ యాజమాన్యంపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతుతున్నాయి. హత్య జరిగిన తర్వాత ఆధారాలు ఎలా మాయం అయ్యాయన్నది అంతుచిక్కడం లేదు. స్కూల్ యాజమాన్యమే ఆధారాలను మాయం చేసి ఉంటుందని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో యాజమాన్యాన్ని కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశముంది. మరోవైపు సీబీఐ విచారణపై ప్రద్యుమన్ తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

  English summary
  Seven-year-old Pradyuman Thakur was murdered at the Ryan International School in Gurgaon by a Class 11 student who wanted his exams and a parent-teacher meeting postponed, the CBI said today, delivering a stunning twist to the case after questioning more than 125 students and teachers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X